నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా.. సంచలనంగా మారిన బన్ని కొత్త టైటిల్..!

shami
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుండగా పూజా హెగ్దే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత లింగుస్వామితో ఓ సినిమా కమిట్ అయిన బన్ని దానితో పాటుగా రచయిత వక్కంతం వంశీ డెబ్యూ మూవీకి సైన్ చేశాడు. మొన్నటిదాకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా ఇప్పుడు టైటిల్ కూడా కన్ఫాం అయినట్టు తెలుస్తుంది.


సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. తన ప్రొడక్షన్ లో ఇప్పటిదాకా లో బడ్జెట్ మూవీలనే తీసుకుంటూ వచ్చిన లగడపాటి శ్రీధర్ ఇప్పుడు బన్ని సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఇక సినిమా టైటిల్ గా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని రిజిస్టర్ చేయించారట. అల్లు అర్జున్ సినిమా కోసమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తుంది.  


టైటిల్ ఇలా బయటకు వచ్చిదో లేదో అప్పుడే మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది. అంతేకాదు ఈ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని పవర్ ఫుల్ గా చెప్పే బన్ని సినిమాలో ఎలా ఉండబోతాడా అని ఫ్యాన్స్ ఎక్సయిటింగా ఉన్నారు. రైటర్ గా సూపర్ సక్సెస్ అయిన వక్కంత వంశీ బన్ని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కథ కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని అంటున్నారు. మరి సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: