“రూలర్” కు ముహూర్తం కుదిరిందా ?

K Prakesh

చాలాకాలానికి  సింహా కాంబినేష‌న్ సెట్స్‌ పైకి వెళ్ల డానికి ముహూర్తం కుదిరి నట్లు తెలుస్తోంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌ - బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో  మరో  సినిమా రాబోతోందని ఎప్పటి నించో వార్తలు వస్తున్నాయి.   ఈ సినిమాకి ‘రూల‌ర్’ అనే పేరు కూడా ప్రచారం లో ఉంది.  అయితే ఈ సినిమా  సెట్స్‌ పైకి వెళ్లడానికి ముహూర్తం కుదరలేదు. ఇంత కాలానికి ఈ సినిమాకి ముహూర్తం పెట్టేశారు అని అంటున్నారు. ఈ సినిమాను జూన్ 15వ తేదీన ఈ సినిమాని లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ని స‌మాచార‌మ్‌. 14 రీల్స్ ఎంటర్‌ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది.

 ప్రస్తుతం క‌థానాయిక‌ల ఎంపిక జ‌రుగుతోందట సినిమాలకు మేకప్ వేసుకో కుండా బాలయ్య ఇలా ఏడాది పాటు ఖాళీగా ఉండటం అయన కెరియర్ లో రికార్డు. బాలయ్య సహా నటులు నాగ్, వెంకటేష్ లు వరుస పెట్టి సినిమాలు చేస్తోంటే బాలయ్య ఖాళీగా ఉండటం నందమూరి అభిమానులకు  మింగుడు పడటం లేదు.  ఈ పరిస్థితులలో బాలయ్య – బోయి పాటిల ఈ సినిమా కనీసం వచ్చే నెల కైనా పట్టాలు ఎక్కుతుందో లేదో చూడాలి .. చాలా రోజుల తరువాత ఈ రోజు నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఓమ్’ ఆడియో వేడుకకు బాలయ్య అతిధిగా  వస్తున్నాడని వార్తలు వస్తున్న నేపధ్యం లో ఈ  ‘రూలర్’ సినిమా ప్రారంభ వార్త నందమూరి అభిమానులకు పండుగే ...

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: