విలువలు పాటించిన విలన్

Prasad
2012 సంవత్సరాని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న ప్రాణ్ ఎన్నో విలువలకు కట్టుబడ్డారు. 1948లో విడుదలయ్యిన ‘జిద్ది’ సినిమాతో విలన్ గా ప్రాణ్ బాలీవుడ్ లో నిలదొక్కున్నారు. ‘బడీ బెహాన్’, ‘శీష్ మహల్’, ‘అదాలత్’, ‘జషాన్’ వంటి చిత్రాలతో విలన్ గా స్థిరపడ్డారు. నటనలో దర్పం, క్రౌర్యం, ద్వేషం, పగ లతో దుష్ట పాత్రలకు ప్రాణ్ ప్రాణప్రతిష్ట చేసేవారు. అప్పట్లో తల్లితండ్రులు తమ పిల్లలకి ప్రాణ్ అనే పేరు పెట్టాలంటే భయపడేంతగా ప్రాణ్ తన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రాణ్ ను గంభీరమైన గాత్రం. విలువలకు కట్టుబడిన వ్యక్తిగా అందరూ ప్రాణ్ కీర్తించేవారు. క్రమశిక్షణ విషయంలోగాని సమయపాలన విషయంలో కానీ ప్రాణ్ నియమాలు పాటించేవాడు. షూటింగ్ లకు ఏనాడు గైర్హాజరు కాలేదు. లేటు గాను రాలేదు. ప్రాణ్ పాత్రలకు సంభాషణలు రాసేటప్పుడు రచయితలూ కొన్ని ప్రమాణాలు పాటించేవారు. అది దుష్ట పాత్రయినా అశ్లీలతతో కూడిన సంభాషణలు పలకరాదనేది ప్రాణ్ స్వయంగా ఏర్పరుచుకున్న నియమం. ఈ నియమాన్ని ప్రాణ్ ఎప్పడూ మరిచిపోలేదు. కాగా, ప్రాణ తెలుగులో సింహాసనం, తాండ్ర పాపారాయుడు, కొదమసింహం చిత్రాల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: