పవన్ మరదలిపై మహేష్ కన్ను
దీంతో పవన్ కళ్యాణ్ సినిమా ‘కాటమరాయుడు’ లో ఛాన్స్ దక్కించుకున్నట్టుగా ‘మానస హిమవర్ష’ అఫిషియల్ గా చెప్పుకుంటూ వస్తుంది. మోడల్ గా, డ్యాన్సర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా ‘మానస హిమవర్ష’ కి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఇప్పటికే ‘రొమాన్స్’ సినిమాలో ‘మానస హిమవర్ష’ ఓ పాత్ర చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న మురుగదాస్ సినిమాలోనూ ఈ బ్యూటికి ఆఫర్ వరించిందని అంటున్నారు.
ఓ చిన్న పాటి పాత్రకోసం మురుగదాస్ టీం... ‘మానస హిమవర్ష’ ని సెలక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ‘మానస హిమవర్ష’ విషయంలోనూ మహేష్ బాబు పాజిటివ్ గానే ఉన్నాడని అంటున్నారు. అంతే కాకుండా ఆ పాత్రకి ‘మానస హిమవర్ష’ పర్ఫెక్ట్ గా సరిపోవటంతో....మహేష్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూవీలో పవన్ కి మరదలిగా నటించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ విషయాన్ని ‘మానస హిమవర్ష’ చెప్పుకొచ్చింది. ‘పవన్ గారికి మరదలిగా నటిస్తున్నాను. పట్టు లంగా, ఓణీ, పరికిణీల్లో కనిపిస్తాను. ఎప్పుడెప్పుడు పవన్ తో కలిసి నటిస్తానా అనే ఆసక్తి ఎక్కువగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. డాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తాజాగా మొదలైంది. ‘మానస హిమవర్ష’ పై ఇండస్ట్రీ సైతం ఫోకస్ పెట్టింది. ఈ బ్యూటికి మరికొద్ది రోజుల్లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.