రూమ్ కు వస్తే మరో ఆఫర్.. ఆ స్టార్ దర్శకుడు అలాంటివాడు.. షకీలా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ శాతం ప్రింట్ మీడియా మాత్రమే అందుబాటులో ఉండేది. దానితో ఎక్కువ శాతం వార్తలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి కావు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. డిజిటల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచం ఏ మూలలో ఎక్కడ ఏ సంఘటన జరిగిన సెకండ్లలో అది మన చేతుల్లోకి వచ్చేస్తుంది. దానితో ఏ చిన్న విషయం అయినా కూడా చాలా పెద్దదిలా కనిపిస్తూ వస్తుంది. ఇకపోతే గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ గురించి అనేక వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇది కనబడుతుంది.

ఇకపోతే తాజాగా జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపుతుంది. జానీ మాస్టర్ తన తోటి డాన్సర్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని ఆ మహిళ ఆయనపై కేసు ఫైల్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విచారణ కూడా వేగవంతంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎంతో మంది నటీమణులు మాపై కొంతమంది దర్శకులు , హీరోలు , నటులు అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి అని నేరుగా చెప్పిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అలా నేరుగా చెప్పిన వ్యక్తులలో షకీలా ఒకరు. ఈమె కెరియర్ బిగినింగ్లో అనేక హాట్ కంటెంట్ కలిగిన సినిమాల్లో నటించిన తర్వాత మాత్రం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ను కొనసాగించింది. కొంతకాలం క్రితం ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె నాకు ఒక స్టార్ డైరెక్టర్ వల్ల ఒక సంఘటన ఎదురైంది అని ఆ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

కొంతకాలం క్రితం షకీలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... తెలుగులో స్టార్ డైరెక్టర్ అయినటువంటి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నేను ఓ సినిమా చేశాను. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన నా రూమ్ కి వస్తే ఇంకో ఆఫర్ ఇస్తాను అని అన్నాడు. దానితో నేను ఇప్పుడు చేసిన సినిమాకు డబ్బులు ఇవ్వండి సరిపోతుంది. నాకు మరో సినిమా ఏం వద్దు అని అన్నాను. ఇక ఈ విషయాన్ని నేను ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెబుతాను. నాకేం భయం లేదు అని ఈమె చెప్పేసింది. ఇలా షకీలా తెలుగులో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకుడుగా కెరియర్ను కొనసాగించిన ఈవీవీ సత్యనారాయణ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: