అల్లు అర్జున్ హీరోగా అదితి అగర్వాల్ హీరోయిన్గా దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావు దర్శకత్వంలో గంగోత్రి అనే మూవీ కొన్ని సంవత్సరాల క్రితం రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో సుమన్ కీలకమైన పాత్రలో నటించగా , ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ తోనే అల్లు అర్జున్ హీరోగా వెండి తర్వాత పరిచయం కాగా , ఈ సినిమా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు 100 వ సినిమాగా వచ్చింది. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు.
ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్థాయి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా విజయంలో ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. కొంతకాలం క్రితం రాఘవేందర్రావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో భాగంగా గంగోత్రి సినిమా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... గంగోత్రి సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి అయింది. ఫైనల్ కాపీ రాకముందు సినిమాను కొంత మంది చూశారు. సినిమా చూసిన వారంతా ఈ సినిమా ఫ్లాప్ అల్లు అర్జున్ కు మొదటి సినిమాతో ఫ్లాప్ గ్యారెంటీ అన్నారు.
ఇక అల్లు అరవింద్ కూడా ఈ సినిమా వేస్ట్ ఇది ఎందుకు పనికిరాదు రాఘవేందర్రావు 100 వ సినిమా కాబట్టి దీన్ని విడుదల చేయాలి కానీ ఈ సినిమా వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నారు. ఆ సమయంలో నేను మళ్ళీ కథను వారందరికీ చెప్పాను. కథ సూపర్ గా ఉంది అన్నారు. మీరు చెబితే బాగుంది కానీ సినిమాగా బాగాలేదు అన్నారు. ఆ తర్వాత మళ్లీ రీ రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత వారు ఫుల్ కాపీని చూశారు. అప్పుడు సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని వారు నమ్మారు అని రాఘవేంద్రరావు చెప్పారు.