18 ఏళ్ల వయస్సులోనే కాస్టింగ్ కౌచ్.. ఇషా కొప్పికర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
కొంతకాలం యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఫిజా అనే సినిమాతో ఈ బ్యూటీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. తనకు 18 సంవత్సరాల వయస్సులోనే కాస్టింగ్ కౌచ్ వల్ల చేదు అనుభవం ఎదురైందని ఆమె పేర్కొన్నారు. ఒక సెక్రటరీ తన దగ్గరకు వచ్చి స్టార్స్ తో స్నేహంగా ఉండాలని సూచించారని ఆమె వెల్లడించారు. 23 ఏళ్ల వయస్సులో బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు తనను ఒంటరిగా కలవాలని సూచించారని ఆమె తెలిపారు.
ఆ సమయంలో ఆ హీరోకు అప్పటికే కొన్ని ఎఫైర్లు ఉన్నట్టు నా దృష్టికి రావడంతో ఆ హీరోను ఒంటరిగా కలవడానికి సమ్మతించలేదని ఇషా కొప్పికర్ అన్నారు. తనకు సంబంధించిన మూవీ ఆఫర్లను సైతం ఇతర నటులు శాసించారని ఆమె పేర్కొన్నారు. విలువలతో ఇండస్ట్రీలో మూవీ ఆఫర్లు రావడం కష్టం అని ఆమె చెప్పుకొచ్చారు. క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు భరించలేక ఇండస్ట్రీకి చాలామంది దూరమయ్యారని ఇషా కొప్పికర్ తెలిపారు.
ఇషా కొప్పికర్ చివరగా అయలాన్ సినిమాలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఇషా కొప్పికర్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటీమణులకు సైతం ఇలాంటి అనుభవాలు ఎదురవ్వడం కొసమెరుపు. ఇండస్ట్రీలోని పరిణామాలు కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టే వాళ్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి.