ఈసారి కూడా సందీప్ తుస్ మనిపించాడా..!

shami
యువ హీరోలందరు తమ టాలెంట్ తో సూపర్ హిట్లతో దూసుకెళ్లి పోతుంటే సందీప్ కిషన్ మాత్రం తన టాలెంట్ కు తగ్గ సినిమాలు చేయకుండా అపజయాలను చవి చూస్తున్నాడు. అయితే ఎన్నో ఆశలతో ఓ సీనియర్ రైటర్ రాసిన కథతో ఒక అమ్మాయి తప్ప అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందీప్ కిషన్ ఈ సినిమా కూడా తుస్ మనిపించాడని అంటున్నారు.


ఆల్రెడీ ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్ షోస్ వేశారు. సినిమా అంతా ట్రాఫిక్ జామ్ తో ఉంటుందని.. కామెడీ కూడా అంత పెద్దగా ఏం వర్క్ అవుట్ కాలేదని.. దర్శకుడు అన్ని కోణాల్లో విఫలమయ్యాడని అంటున్నారు. మరి ప్రీమియర్స్ కే ఇలాంటి షాకింగ్ టాక్ వస్తే రెగ్యులర్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఇదే కథ దాదాపు 13 మంది నిర్మాతలు రిజక్ట్ చేస్తే ఒక అమ్మాయి తప్ప నిర్మాత అంజిరెడ్డి ఓకే చేశారు. 


సో ఎందుకు ఆ 13 మంది నిర్మాతలు ఓకే చేశారో ఇప్పుడు అర్ధమైందని అంటున్నారు. సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధానంలో అన్ని కోణాల్లో విఫలమైందట. దర్శకుడు రాజ సింహ మొదటి సినిమా అయినా సరే ఎందుకో సినిమా మీద గ్రిప్ కోల్పోయాడని అంటున్నారు. సో మొత్తానికి రన్ ఫ్లాప్ తర్వాత ఒక అమ్మాయి తప్ప మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సందీప్ కిషన్ కు ఈ సినిమా కూడా నిరాశే మిగిల్చిందని అంటున్నారు. 


ఒకవేళ సినిమా రెగ్యులర్ ఆడియెన్స్ కు ఏమన్నా నచ్చే అవకాశం ఉందేమో చూడాలి. ఇప్పటికే చిత్ర యూనిట్ ఇచ్చిన ప్రమోషన్స్ కు సినిమా చూసేందుకు ఆడియెన్స్ మంచి ఎక్సైటింగ్ లో ఉన్నారు కాని ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ చూసిన కొందరు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. మరి ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలియాలంటే ఈరోజు సాయంత్రం దాకా ఆగితే సరిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: