మోహన్ బాబు చిరంజీవిల మధ్య సన్నిహిత సంబంధాలు అంతంతమాత్రమే అయినా బయట ఫంక్షన్స్ లో కనిపించినప్పుడు మాత్రం ఒకరి పై ఒకరు ప్రేమను కురిపిస్తూ మీడియా కెమెరాలకు తెగ పోజులు ఇస్తూ ఉంటారు. ఇదే సాంప్రదాయాన్ని మంచు మెగా కుటుంబాల పిల్లలు కూడ కొనసాగిస్తూ ఉండటంతో ఈ కుటుంబాల హీరోల మధ్య స్నేహం ఎవరికీ అర్ధంకాని పజిల్ గా ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది.
ఈ వార్తలు ఇలా ఉండగా మంచు మనోజ్ ఒక షాకింగ్ కోరికను రామ్ చరణ్ దృష్టికి తీసుకు వచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం చరణ్ త్వరలో షూటింగ్ మొదలు పెట్టబోతున్న ‘ధని ఒరువన్’ రీమేక్ లో విలన్ పాత్ర అవకాశం తనకు ఇస్తే బాగుoటుంది అన్న సంకేతాలను ఒక మధ్య వర్తి ద్వారా చరణ్ కు చేరవేసినట్లు టాక్. ఈ అనుకోని మంచు వారి కోరికకు షాక్ అయిన చరణ్ తన సమాధానాన్ని కూడ మర్యాద పూర్వకంగానే మనోజ్ కు పంపినట్లు వార్తలు వస్తున్నాయి.
‘ధని ఒరువన్’ సినిమాకు సంబంధించి విలన్ పాత్ర ఎంపిక కూడ పూర్తి అయిన నేపధ్యంలో ఇప్పుడు ఇంత ఆలస్యంగా మనోజ్ తన కోరికను బయట పెట్టాడు ఏమిటి అని చరణ్ తనను కలిసిన వ్యక్తితో కామెంట్ చేసినట్లు టాక్. దీనిని బట్టి చూస్తూ ఉంటే ఈసినిమాలో కాకపోయినా రాబోయే సినిమాలలో అయినా చరణ్ కు విలన్ గా మనోజ్ నటించే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోంది.
మంచు మనోజ్ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకోవడం కష్టం అవుతున్న నేపధ్యంలో తన తండ్రి మోహన్ బాబు వారసత్వాన్ని కొనసాగిస్తూ విలన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఈ మంచు వారి అబ్బాయి ఆశ పడుతున్నాడు అన్న విషయం బయట పడింది కాబట్టి ఎవరో ఒక టాప్ డైరెక్టర్ మంచు మనోజ్ కోరిక త్వరలోనే తీర్చే అవకాశం ఉంది. మనోజ్ తన గెటప్ మార్చుకుని ప్రస్తుతం నటిస్తున్న ‘శౌర్య’ సినిమా కూడ అనుకున్న విజయాన్ని సాధించకపోతే మనోజ్ కెరియర్ మరింత సమస్యలలో పడుతుంది అనడంలో ఎటువంటి సందేహంలేదు..