మనీ: ఉన్న ఊరిలోనే కాలు కదపకుండా చేసే ఈజీ బిజినెస్..!!

Divya
ప్రస్తుతం చాలామంది ప్రజలు బిజినెస్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.ఉద్యోగం అనేది బానిసత్వంగా భావిస్తూ ఉన్నారు.. అందుకే చాలా మంది సైతం సొంతంగా బిజినెస్ ను ప్రారంభించాలని పలు రకాల బిజినెస్ ఐడియాలతో ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనే విషయం పైన చాలామంది సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చి వ్యాపారాల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..మనం చేసేటువంటి బిజినెస్ లు అన్నీ కూడా పల్లెల వ్యాపారం నుంచి అయినా మనం మొదలు పెట్టుకోవచ్చు..

1).మూలికల వ్యాపారం..ఈ మూలికలు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ఆయుర్వేద వాటిలలో ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలను పెంచుతూ బిజినెస్ ని మొదలుపెట్టడం వల్ల మంచి లాభాలను అందుకోవచ్చు.

2). చాలామంది బయట పనులకు వెళ్లడానికి మక్కువ చూపుతూ ఉన్నారు. ఇలాంటి వ్యాపారంలో కూడా మంచి లాభం ఉన్నది. ముఖ్యంగా ఏదైనా కాంట్రాక్టర్ వ్యాపారం తీసుకున్నప్పుడు అందుకు తగ్గట్టుగా పని చేయిస్తే అక్కడి నుంచి కూడా కమిషన్ రూపంలో భారీగానే సంపాదించవచ్చు.

3). వర్మీ కంపోస్ట్ వ్యాపారం వల్ల కూడా మంచి లాభాలను అందుకోవచ్చు. పల్లెలలో మనకు చౌక ధరకే కాస్త ఎరువు లభిస్తుంది. ఈ ఎరువుతో మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసి అమ్మడం వల్ల మంచి లాభాలు ఉంటాయి.

4). పూల వ్యాపారం ఈ పూల వ్యాపారం వల్ల రోజుకి మంచి లాభాలను అందుకోవచ్చు. పల్లెలనుంచి పూసిన పూలను మార్కెట్లో ఉండే వాటికంటే కాస్త చౌక ధరకే కొని మార్కెట్లో అధిక ధరకు అమ్మడం వల్ల మంచి లాభాలు అందుకోవచ్చు.

5). పల్లెలలో బ్యూటీ పార్లర్ వ్యాపారం ప్రారంభించడం వల్ల మంచి లాభాలను అందుకోవచ్చు.ఏదైనా ఫంక్షన్ ఫెస్టివల్ సందర్భంగా చాలామంది మహిళలు బ్యూటీ పార్లర్ కు వెళ్తూ ఉన్నారు. ఇలాంటి బ్యూటీ పార్లర్ సొంత ఊర్లో పెట్టడం వల్ల మంచి లాభాలు.

కలబంద వ్యవసాయ రంగంతో వ్యాపారం మొదలు పెట్టడం వల్ల కూడా ఏడాదికి లక్షల రూపాయలలో ఆదాయాన్ని అందుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: