ఏపీ: హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం..ఎందుకు? ఏం జరిగిందంటే..?
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని పిటిషన్ వేయడంతో ఈ అంశం పైన తక్షణమైన చర్యలు తీసుకోవాలంటు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడం అత్యంత అవసరమని, హక్కుల ఉల్లంఘనకు పాల్పడినటువంటి సోషల్ మీడియా అకౌంట్ల పైన వారం రోజులలో చర్యలు తీసుకోవాలంటు హైకోర్టు పలు రకాల కంపెనీలకు ఆదేశాలను జారీ చేసింది. పవన్ కళ్యాణ్ తరపున న్యాయవాది కూడా మరో రెండు రోజులలో ఇందుకు సంబంధించిన వివరాలను, లింకులను, స్క్రీన్ షాట్లను కూడా సోషల్ మీడియా సంస్థలకు అందజేయాలంటూ హైకోర్టు పవన్ కళ్యాణ్ తరపున న్యాయవాదికి తెలియజేసింది.
ఈ వివరాలు అందిన వెంటనే కంపెనీల సైతం తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి తదుపరి విచారణ డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేసినట్లుగా తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికి బాలీవుడ్ టాలీవుడ్ లో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత హక్కులను కాపాడుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అలాంటి వారి బాటలోనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్రామస్థాయిలోని రాజకీయాలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి 15 సంవత్సరాల పాటు విడిపోకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఎన్నికలలో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని అన్ని విషయాలను సీఎం చంద్రబాబుతో చర్చించి మరి అమలు చేస్తామంటూ తెలియజేస్తున్నారు.