మనీ: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ వారి ఖాతాలో డబ్బు జమా..!!

Divya
రైతులకు పెట్టుబడి సహాయం అందించే ఉద్దేశంతోనే..BRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పథకాన్ని సైతం ప్రారంభించింది..ఈ పథకంలో భాగంగా ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున ఏడాదికి రెండుసార్లు రైతుల ఖాతాలో ఈ డబ్బును జమ చేస్తూ ఉండేవారు.. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని తీసుకుంది. నవంబర్ నెలలో రావాల్సిన రెండో విడత రైతుబంధు నిధులను కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయాయి.. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలోని రైతుబంధు నిధులు నిలిచిపోయాయి.

మూడు వారాల క్రితమే రైతుబంధు డబ్బులు రిలీజ్ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను సైతం జారీ చేశారు.. అయితే ప్రభుత్వ మొదట 10 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాలో రైతుబంధు నిధులను జమ చేశారు. ఆ తర్వాత ఎకరం ఉన్న వాళ్లకు నిధులను జమా చేశారు.. ఇప్పటి వరకు ఎకరం పైగా ఉన్న వాళ్లకు మాత్రం డబ్బు జమ చేయలేదు.. తాజాగా రేవంత్ ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త అందిస్తోంది.. నిన్నటి రోజున ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల భూమి పైన ఉన్న రైతుల ఖాతాలో సైతం డబ్బు జమ అయ్యాయని తెలియజేశారు.

ఒకటి లేదా రెండు రోజులలో అందరి రైతుల ఖాతాలో ఈ డబ్బు జమ అవుతుందని తెలియజేశారు. దీంతో రైతులకు సైతం శుభవార్త చెప్పినట్లు అయింది. అయితే తాజాగా ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్య ఉన్న వారికి రైతుబంధు నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.. కొత్తగా పాసుబుక్ వచ్చిన వారికి పంట పెట్టుబడి సహాయం మొన్నటి వరకు దరఖాస్తులను సైతం స్వీకరిస్తూనే ఉన్నారు.. ఇంకా చాలా మంది ఉండడంతో కొద్ది రోజులు ఈ దరఖాస్తులు స్వీకరణను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగానే రైతు భరోసా కు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: