వామ్మో.. ఈ రాఖీ ధర.. ఐఫోన్ కంటే ఎక్కువే?
ఐఫోన్ కంటే ఎక్కువ కాస్లి రాఖి కి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ప్రతి ఏడాది వారణాసిలో గోల్డ్ రాఖీలు అబ్బురపరుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ గోల్డ్ రాఖీల ధర ఐఫోన్ కన్నా ఎక్కువ ఉండడం విశేషం. ప్రస్తుతం వారణాసిలో ఉన్న దుకాణాలలో అమ్ముతున్న రాఖీల విలువ దాదాపు 1.15 లక్షల వరకు ఉంటుందట. కాస్త తక్కువ బరువు ఉన్న గోల్డ్ రాఖీలు అయితే 80 వేల వరకు ధర ఉంటుందట. అయితే ఒకే డిజైన్ లో కాకుండా వేర్వేరు డిజైన్లలో కూడా ఈ గోల్డ్ రాఖీలు అందుబాటులో ఉన్నాయట.
అయితే ఈ గోల్డ్ రాఖీకి మరింత స్పెషాలిటీ కూడా ఉంది. బంగారం మాత్రమే కాదు వజ్రాలు కలిపి ప్రత్యేకంగా వ్యాపారులు ఈ గోల్డ్ రాఖీని తయారు చేస్తారట. అయితే కొంతమంది ముందుగానే ఆర్డర్ ఇచ్చి మరి ఈ రాఖీలను తయారు చేయించుకుంటూ ఉంటారట. 18, 20, 22 క్యారెట్ల బంగారంతో తయారైన రాఖీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయట. ఇక వీటిల్లో కొన్ని ప్రత్యేకమైన రాఖీలు 15 వేల నుంచి ప్రారంభం అవుతాయని తెలుస్తుంది. గులాబీ రంగు మీనారికతో రూపొందిన రాఖి 22,000 రూ.. పింక్ మీనాకరి రంగుతో రూపొందిన రాఖి ధర పదివేల వరకు ఉంటాయని అక్కడి వ్యాపారాలు చెబుతున్నారు.