సామాన్యులకు గుడ్ న్యూస్.. వాటి ధరలు పెరగవట?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీగా పెరిగిపోయిన టమాటా ధరలు అటు సామాన్యుడికి భారంగానే మారిపోయాయి. ఉల్లిపాయలు కోస్తేనే కన్నీళ్లు వచ్చేవి మొన్నటి వరకు.. కానీ ఇప్పుడు టమాటా కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంది. చివరికి సామాన్యులు టమాటా లేకుండానే వంటకాలు కానిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అని చెప్పాలి.

 కాగా మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పడతాయేమో అని సామాన్యులు ఎదురుచూస్తున్నారు. కానీ అంతకంతకు రేట్లు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అయితే పెరిగిపోయిన టమాటా ధరల కారణంగా ఒక్క టమాటా రైతు తప్ప మిగతా ఎవరూ కూడా సంతోషంగా లేరు అని చెప్పాలి. అయితే ఇప్పుడు టమాటా బాదుడు చాలదు అన్నట్లు.. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు కూడా మరోసారి భారీగా పెరిగిపోయే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు అని చెప్పాలి.

 అయితే రానున్న రోజుల్లో ఉల్లి ధరలు కూడా పెరుగుతాయని అంచనాలు ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కాస్త ముందుగానే అప్రమత్తమైంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే మూడు లక్షల టన్నుల బఫర్ స్టాక్ ను కొనుగోలు చేసినట్లు ఇటీవల కేంద్రం వెల్లడించింది. అయితే గత ఏడాదితో పోల్చి చూస్తే ఇది 20% ఎక్కువ అంటూ తెలిపింది. దీంతో ఇక రానున్న రోజుల్లో ఉల్లి కొరత ఏర్పడినప్పటికీ.. ఇక ధరలు పెరిగే ఛాన్స్ లేదు అన్నది తెలుస్తుంది. కాగా ఉల్లిని ఎక్కువ కాలం నిలువ ఉంచేలా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తున్నాము అంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 
. అయితే ఇప్పటికే పెరిగిపోయిన టమాటా రేట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులు.. ఇక ఇప్పుడు ఉల్లి రేట్లు పెరగవు అని కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: