Money: ఆ బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచుతూ..!

Divya
Money.. తాజాగా bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును ఎప్పటిలాగే ఉంచినప్పటికీ కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు సవరించడం జరిగింది. ఇప్పటికే ఎన్నో బ్యాంకులు వినియోగదారులను ఆకర్షించడానికి మంచి వడ్డీ రేట్లు కూడా ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ , ప్రైవేటు, స్మాల్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఖాతాదారులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
ఇకపోతే తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన.. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది కాలం ఫిక్స్డ్ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హర్షదాయకం. ఇకపోతే రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు చేసే  ఇన్వెస్టర్లకు ఒక ఏడాది కాలం డిపాజిట్ పై ఏడు శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది . ఇకపోతే ఇది కేవలం ఇంతకుముందు ఆరు శాతంగా ఉండగా ఇప్పుడు 100 బేసిస్ పాయింట్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  ఇక పెంచిన వడ్డీ రేట్లు మే 26 నుంచి అమలులోకి వచ్చినట్లుగా కూడా ప్రకటించింది. ఏడు రోజుల నుంచి 10  సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు పై మూడు శాతం నుంచి ఏడు శాతం వరకు వడ్డీ రేట్లు పెంచడం జరిగింది.
ఇక 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ గా.. ఏడాదికాలం ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.5% వడ్డీ అలాగే 80 సంవత్సరాల నిండినవారికి సూపర్ సిటిజన్స్ గా 7.65% ఏడాదికి వడ్డీ ఇస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఇక తాజాగా వడ్డీరేట్ల సవరణ 7 శాతానికి పెరగడం నిజంగా మంచి అవకాశమని చెప్పాలి.. కొత్త వడ్డీ రేట్లు ఎన్నారై , ఎన్నార్ ఈ, దేశీయ డిపాజిట్లకు వర్తిస్తాయని కూడా బ్యాంకు స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: