మనీ: ఈ పంటతో రైతులకు బోలెడు లాభాలు..!

Divya
ఇటీవల కాలంలో వ్యవసాయం చేయడానికి చదువుకున్న వారు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు అధ్యాయాధునిక పద్ధతులను అవలంబిస్తూ.. వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇప్పుడు చెప్పబోయే ఒక పంటతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.  పైగా ఆదాయానికి మించి ఆదాయం వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. అదే బ్లాక్ రైస్ సాగు. నల్లటి బియ్యం కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది.  ఈ నేపథ్యంలోనే నల్లటి బియ్యం మీరు సాగు చేసినట్లయితే ఊహించని రేంజ్ లో మీకు లాభాలు వస్తాయి.
ఈ నల్ల బియ్యం పంట నాలుగు నెలలు మాత్రమే.. వరి నారు పోసినప్పటి నుంచి పంట చేతికి రావడానికి సుమారుగా 100 నుంచి 120 రోజుల సమయం పడుతుంది. సాధారణ వరి మొక్కల కంటే నల్ల వరి మొక్కలు కొంచెం పొడవు గా ఉంటాయి. అంతేకాదు వీటి కంకులు కూడా కొంచెం పెద్దగా వుంటాయి. ఇకపోతే సాధారణ బియ్యం ధర కిలో 50 రూపాయలు ఉంటే నల్లబియ్యం ధర 250 రూపాయలు ఉంటుంది. ఇటీవల కాలంలో చాలామంది ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ధ చూపెడుతున్న నేపథ్యంలో నల్ల బియ్యం ధర కూడా భారీగా పెరుగుతోంది. కాబట్టి మీరు ఈ నల్ల బియ్యం సాగు చేసినట్లయితే మీకు మంచి ఆదాయంతో పాటు అంతకుమించిన ప్రయోజనాలను ఇతరులకు పంచిన వారవుతారు.
ముఖ్యంగా నల్లబియ్యం ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ , హృదయ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయని ఇప్పటికే పలు అధ్యయనాల ద్వారా నిరూపితమైంది. 10 గ్రాముల నల్లబియ్యం నుంచి తొమ్మిది గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ఫైబర్, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ బియ్యం తో రైతులు మంచి లాభాన్ని పొందుతారు.మీరు కూడా ఈ వ్యాపారంతో మంచి ఆదాయం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: