మనీ: 6.5 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..!

Divya
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజాగా 6.5 కోట్ల మంది పిఎఫ్ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఈసారి ఉద్యోగుల దీపావళి మరింత శోభాయమానంగా మారనుంది . ఇక పిఎఫ్ ఖాతాదారుల ఖాతాలో వడ్డీ మోతాన్ని త్వరలో బదిలీ చేయనున్నారు. త్వరలో 2021 - 2022 వడ్డీని 6.5 కోట్ల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్ల ఖాతాలకు బదిలీ చేసే పనిలో ఉన్నారు అధికారులు. ఈసారి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన సభ్యుల ఖాతాలో ఏకంగా 8.1% వడ్డీని జమ చేయనుంది. ఇక ఈ మొత్తం నేరుగా పిఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది. ఇక ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చివరి సమావేశంలో వడ్డీ పై ఈ నిర్ణయం తీసుకోవడం అందరికీ హర్షదాయకం.. ఇకపోతే దీని తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీనిపై అంగీకారాన్ని స్పష్టం చేసింది.

ఇకపోతే ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు డియర్ నెస్ అలవెన్స్ బేసిక్ లో 24% కలిపి జమ చేస్తారు. కానీ సంస్థ మొత్తం చెల్లింపు పై మీకు వడ్డీని అందించదు. ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వడ్డీ మొత్తాన్ని ఏ మొత్తంలో చెల్లిస్తుందో కూడా మీరు తెలుసుకోవాలి. ఇకపోతే ఆర్థిక సంవత్సరం చివరి తేదీలో మీరు ఏదైనా ఉపసంహరణ జరిగితే అప్పుడు 12 నెలల వడ్డీ మినహాయించబడుతుంది. సంస్థ ఎప్పుడూ కూడా ఖాతా ప్రారంభ, ముగింపు బ్యాలెన్సులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. ఇకపోతే ఈపీఎఫ్ఓ లో వడ్డీ డబ్బును తనిఖీ చేయడానికి మీరు చింతించాల్సిన అవసరం లేదు.

ఖాతాలో వడ్డీ డబ్బు జమ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈపీఎఫ్ఓ నుండి వడ్డీ బదిలీ గురించి సమాచారం . ప్రతి చందాదారుడికి మెసేజ్ ద్వారా అందించబడుతుంది కాబట్టి మీకు మీరే మెసేజ్ పంపడం ద్వారా ఖాతాలోని బ్యాలెన్స్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మీరు మీ ఫోన్లో EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కి మెసేజ్ పంపాలి. ఇక మెసేజ్ లోని చివరి మూడు అక్షరాలు భాషకు సంబంధించినవి. ఇలా చేస్తే మీరు మీ ఖాతాలో వడ్డీ డబ్బు జమ అయిందో లేదో తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: