మనీ: ఇలా పొదుపు చేశారు అంటే ప్రతి నెల రూ.1 లక్ష పెన్షన్..!!

Divya
ఏదైనా ఒక పెన్షన్ పథకంలో చేరి వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలి అనుకుంటున్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక పెన్షన్ స్కీము మీకు నెలకు లక్ష రూపాయలు వరకు పెన్షన్ అందించడానికి సిద్ధంగా ఉంది. రిటైర్మెంట్ తర్వాత లభించే పెన్షన్ వృద్ధులకు ఎన్నో రకాలుగా ఆర్థికంగా అండగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. అందుకే పెన్షన్ అవసరాలను గుర్తించి ఇప్పటినుంచి పొదుపు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇకపోతే రిటైర్మెంట్ తర్వాత ఉండే ఖర్చులను అంచనా వేసి ప్రతి నెల ఎంత పెన్షన్ కావాలో ముందుగానే లెక్కించి అందుకు తగ్గట్టుగా పొదుపు చేస్తే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టం కూడా ఒకటి. ఇక ఈ స్కీం  లో పొదుపు చేయడం వల్ల నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే పొదుపు చేసే మొత్తాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. నేషనల్ పెన్షన్స్ ఎక్కువ ప్రయోజనం కూడా ఉంటుంది. రిటైర్మెంట్ కు చాలా సమయం ఉంటుంది.. కాబట్టి ముందు నుంచి చేసే పొదుపు మంచి రిటర్న్స్ ఇస్తుంది. నేషనల్ పెన్షన్స్ తర్వాత ఒకేసారి మొత్తం డబ్బులు తీసుకోవచ్చు లేదా పెన్షన్ కూడా పొందవచ్చు.
నేషనల్ పెన్షన్స్ స్కీమ్ లో టియర్ వన్ అకౌంట్ ఎంచుకుంటే 60 ఏళ్ల వయసు వచ్చేవరకు పొదుపు చేయాలి. ఇక సబ్స్క్రైబర్ కు 60 ఏళ్ల వయసు వచ్చేవరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో కార్పస్ లో 60% విత్ డ్రా కూడా చేసుకోవచ్చు ఇక మిగతా 40 శాతాన్ని మంత్లీ పెన్షన్ గా మార్చుకుంటే సరిపోతుంది.. ఉదాహరణకు 25 సంవత్సరాల వయసున్నప్పుడు 35 ఏళ్ల పాటు పొదుపు చేస్తే ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకొని చేరితే మంచి ఆదాయం ఉంటుంది. మీరు లక్ష రూపాయల పెన్షన్ పొందాలి అనుకుంటే మీరు పెట్టే పెట్టుబడి పైన ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: