వడ్డీ రేట్లను పెంచుతూ తమ కస్టమర్లకు శుభవార్త తెలిపిన ఐసిఐసిఐ బ్యాంక్..!!

Divya
చాలామంది ఇటీవల కాలంలో మెరుగైన రిటర్న్ లను పొందడానికి ఫిక్స్డ్ డిపాజిట్ లలోనే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇకపోతే పెట్టుబడులకు మెరుగైన ఆఫర్ లను అందిస్తూ..ఫిక్స్డ్ డిపాజిట్లు అందరికీ అందుబాటులో ఉండడం గమనార్హం . అంతేకాదు గ్యారెంటీ రిటర్నులు కూడా అందిస్తున్న నేపథ్యంలో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లపై డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే  సేవింగ్స్ ఖాతా లతో పోలిస్తే ఎక్కువ రిటర్న్ లను  కేవలం మనకు ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారానే లభిస్తున్నాయి.. అన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఇకపోతే తాజాగా ఐసిఐసిఐ బ్యాంకు కూడా తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ తీసుకువచ్చింది.
ఎవరైతే ఐసిఐసిఐ బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారో అలాంటి వారికి వడ్డీ రేట్లను పెంచుతూ ప్రకటించడం గమనార్హం. ఇక వడ్డీ రేట్లు కూడా గురువారం నుంచే అమలులోకి తీసుకు వచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్ . ఇకపోతే ప్రైవేట్ రంగానికి చెందిన ఐసిఐసిఐ బ్యాంకు కు ఖాతాదారులకు శుభవార్త తీసుకువచ్చి కస్టమర్లకు భరోసాను ఇచ్చింది. ఇకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పది బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఐసిఐసిఐ బ్యాంకు ప్రకటించింది. సంవత్సరం పై నుంచి పది సంవత్సరాల వ్యవధి గల టెన్యూర్ లపై పెంచిన వడ్డీరేట్లు అమలులోకి వస్తాయని పేర్కొనడం జరిగింది.
ఇకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ రెండు కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఐదు కోట్ల రూపాయల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లు వర్తించడం గమనార్హం. గురువారం నుంచి చిన్న వడ్డీరేట్లు అమలులోకి వస్తాయి కాబట్టి ఏడాది నుంచి మూడు వందల ఎనభై తొమ్మిది రోజుల వ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్ లకు 4.25 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇక 18 నెలల కంటే తక్కువ వ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.3 శాతం వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తుండడం గమనార్హం. రెండేళ్ల టెన్యూర్ గల డిపాజిట్లకు 4.40 శాతం మూడు సంవత్సరాల టేన్యుర్ డిపాజిట్లకు 4.60 శాతం వడ్డీ రేట్లను ఐసిఐసిఐ బ్యాంక్ అందించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: