మనీ: రూపాయి కంటే తక్కువ వడ్డీకే రుణాలు.. ఏ బ్యాంకులో అంటే..!!

Divya
సాధారణంగా చాలామందికి అత్యవసరంగా డబ్బు అవసరమైతే బయట పది రూపాయలైనా సరే వెచ్చించి వడ్డీకి డబ్బులు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వడ్డీ పెరిగిపోవడం..  అసలు కూడా కట్టలేని స్థితికి చేరుకుంటున్నారు. మరికొంతమంది బ్యాంకులకు వెళ్లి పర్సనల్ లోన్ అప్లై చేస్తూ కొంత వరకు వడ్డీ భారం పడడంతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మీరు కూడా లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు అయితే ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో ముందుగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే లోన్ కోసం అప్లై చేయడం ఉత్తమం. ప్రభుత్వ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తున్న విషయం తెలిసిందే అలాంటి వాటిలో స్టేట్ బ్యాంకు కూడా ఒకటి.
ఇక వడ్డీరేటు 8.5 శాతం నుంచి మొదలవుతున్నాయి. ఎవరైనా సరే తీసుకునే రుణం ప్రాతిపదికన వడ్డీరేట్లు కూడా మారుతూ ఉంటాయి అని గమనించాలి. ఇంటి మరమత్తులు,  పిల్లల చదువు , పెళ్లి, చిన్న చిన్న రుణాలు చెల్లింపులు , ట్రావెల్ ఇలా రకరకాల వాటికోసం మనకు డబ్బు అవసరం అవుతుంది. కాబట్టి వీటన్నిటి కోసం కూడా మీరు పర్సనల్ లోన్ పొందవచ్చు. ఇకపోతే లోన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత కొన్ని గంటల్లోనే డబ్బులు మీ బ్యాంకు ఖాతా లోకి వచ్చేస్తాయి. కొన్ని బ్యాంక్ లు   ఒకటి నుంచి రెండు రోజుల వరకు టైం తీసుకున్న.. ఎమర్జెన్సీ అవసరాల కోసం అయితే వెంటనే మీ ఖాతాలో డబ్బులు చేరిపోతాయి.
ఇకపోతే పర్సనల్ లోన్ పై తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఏకంగా కొన్ని బ్యాంక్ లు ప్రీ అప్రూవ్డ్ రుణాలు కూడా అందిస్తున్నాయి. ఇకపోతే క్రెడిట్ స్కోర్ బట్టి మనకు లోన్ అప్రూవల్ అనేది జరుగుతుంది. ఇక వ్యక్తిగత రుణాలపై ఇండియన్ బ్యాంక్ 8.5 శాతం వడ్డీ తో ఇస్తుండగా.. యూనియన్ బ్యాంకు 8.9, సెంట్రల్ బ్యాంకు 8.9, నేషనల్ బ్యాంకు 8.9, ఐడిబిఐ బ్యాంక్ 9.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఇక అన్నింటినీ మీరు పరిశీలించిన తర్వాత ఎక్కడ తక్కువ వడ్డీ రేటు ఉందో ఆ బ్యాంకులు రుణం తీసుకోవడం ఉత్తమం
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: