ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారింది. ఇక్కడ టిడిపి నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మైలవరం మొత్తం వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ దేవినేని ఉమా మధ్య ఫైట్ విపరీతంగా నడుస్తోంది. గెలుపు అనే అంశాన్ని పక్కన పెడితే ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరే ఎక్కువవుతోంది. అలాంటి మైలవరం నియోజకవర్గంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అది ఏంటో చూద్దాం. మైలవరం టిడిపి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు. కృష్ణ ప్రసాద్ గత ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజాగా ఆయన టిడిపిలో చేరడంతో చంద్రబాబు ఈయనకి టికెట్ అప్పజెప్పారు. గత కొంతకాలంగా టిడిపిని నడిపిస్తున్నటువంటి దేవినేని ఉమాకు టికెట్ రాకపోవడంతో వసంత దేవినేని మధ్య విపరీతమైన ఘర్షణ ఏర్పడింది.
టిడిపి హవా నడుస్తున్న నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు వల్ల ఆ సీటు లాస్ అయ్యే అవకాశం ఉందని చంద్రబాబు గ్రహించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చరట. ఇద్దరిని పిలిచి సర్ది చెప్పి కలిసిపోయేలా చేశారట. దీంతో ఇద్దరు బద్ధ శత్రువులు బిగ్ బాస్ ముందు చేతులు కలిపి ఎన్నికల బరిలోకి దూకారు. వీరిద్దరూ ఒకటవడంతో టిడిపి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. విజయం టిడిపిదే వార్ వన్ సైడ్ అవుతుందనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు దేవినేని ఉమాను పిలిచి మీకు టికెట్టు రాలేదని బాధపడొద్దు. అధికారంలోకి రాగానే మీకు ఏదో ఒక విధంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారట. దీంతో దేవినేని ఉమ, వసంత కృష్ణ ప్రసాద్ లు గొల్లపూడిలోని ఉమామహేశ్వరరావు కార్యాలయంలో ఆదివారం రాత్రి చేతులు కలిపారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేము పాటిస్తున్నామని, చంద్రబాబును సీఎం చేసేందుకు ఇద్దరం కలిసి పనిచేస్తామని ఉమామహేశ్వరరావు తెలియజేశారు. ఇప్పటినుంచి నియోజకవర్గంలో అన్నదమ్ముల్లా పని చేస్తామని రాక్షస రాజ్యాన్ని కూల ద్రోస్తామని అన్నారు. ఈ విధంగా ఇద్దరు బలమైన నేతలు ఏకతాటిపైకి రావడంతో వైసిపి తరపున పోటీ చేసే సర్నాల తిరుపతిరావు గెలుపు కష్టమే అంటున్నారు. తిరుపతిరావు,వసంత కృష్ణ ప్రసాద్ యొక్క అనుచరుడే. వైసీపీలో ఉన్నప్పుడు తిరుపతిరావు ను జడ్పిటిసిగా గెలిపించింది కృష్ణ ప్రసాదే. అయితే రాజకీయ పరిణామాల్లో భాగంగా గురుశిష్యుల మధ్య ప్రస్తుతం పోటీ ఏర్పడింది. కానీ ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ తాకిడిని తట్టుకునే అంత శక్తి తిరుపతిరావుకు లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కృష్ణ ప్రసాద్ తో దేవినేని ఉమా కూడా కలవడం వల్ల వీరి బలం మరింత పెరిగిందని ఇక్కడ టిడిపిదే విజయం అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.