మనీ: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త..!!

Divya
ఆదాయపు పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 - 2022 మార్చి 20వ తేదీ వరకు 2.26 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ. 1.93 లక్షల కోట్ల పన్ను వాపస్ జారీ చేసి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త కలిగించింది.. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం .. రూ.38,447.27 కోట్ల విలువైన 1.85 కోట్ల రిఫండ్ లు 2021 - 2022 మార్చి 20వ తేదీకి ముగియనున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టాక్సెస్ 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 20వ తేదీ వరకు 2.26 కోట్ల పన్ను చెల్లింపుదారులకు సుమారుగా రూ.1,93,720 కోట్ల రీఫండ్ లను జారీ చేసింది అని ఇటీవల ఆదాయపు పన్ను శాఖ గురువారం ఒక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది..

ముఖ్యంగా కార్పొరేట్ పన్ను  రిఫండ్ రూ.1,22,744 కోట్ల రూపాయలు , వ్యక్తిగత ఆదాయపు పన్ను కింద 70,977 కోట్లు రూపాయలు వాపస్ చేసినట్లు సమాచారం. అయితే మీరు కూడా పన్ను చెల్లింపుదారులు అయితే మీ ఇన్కమ్ టాక్స్ రిఫండ్ వచ్చిందా లేదా అనే ప్రశ్న కూడా మీ మనసులో ఉంటే మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా సులభంగా మీ ఖాతాలో చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఒకవేళ మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఇంకా రిఫండ్ రాకపోయినట్లయితే దీనికి కూడా ఎన్నో కారణాలు ఉండవచ్చు అని ఆదాయపు శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదాయపన్ను శాఖ కొత్త వెబ్సైట్ రాకతో ఆదాయపన్ను రిటర్నులు కూడా దాఖలు చేయడం చాలా సులభతరం కావడంతోపాటు పేపర్ లెస్ గా మారిపోయింది.

ఇకపోతే ఆదాయపుపన్ను దాఖలుకు చివరి తేదీ ముగుస్తోంది కాబట్టి మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయకుంటే మార్చి 31వ తేదీ లోపు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు పెనాల్టీ తోపాటు  రిటర్న్స్ కు కటాల్సి ఉంటుంది. మీరు అప్రమత్తమయ్యి.. ఇంకా పన్ను చెల్లించకపోతే ఆదాయపు పన్ను ఫైల్ చేయడం మంచిది ఇక ఎన్ ఎస్ డి ఎల్ వెబ్ సైట్ లో కూడా మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ చెక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: