మనీ: రూ.25 షేర్ తో రూ.16 లక్షలు లాభం.. ఎలా అంటే..?

Divya
షేర్ మార్కెట్ లో డబ్బులు పెడితే లాభాలు కూడా భారీగానే పొందవచ్చు.. అయితే ఇది అంత సులభం మాత్రం కాదు అదృష్టం ఉండాలి.. ఒకవేళ టైం బాగోలేక పోతే పెట్టిన డబ్బులు కూడా వెనక్కి పోయే ఆస్కారం ఉంటుంది. అయితే అదృష్టం కనుక ఉంది అంటే పెట్టిన పెట్టుబడికి సుమారుగా పది రెట్లు ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. కరోనా కారణంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా చాలా రకాల షేర్లు అద్భుతమైన రాబడిని అందించడం జరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అధిక రాబడిని అందించిన షేర్లలో క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ షేర్ కూడా ఒకటి .
2021లో మల్టీ బ్యాగ్ షేర్లలో  ఈ షేర్ కూడా ఒకటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే గత రెండు సంవత్సరాల కింద క్వాలిటీ ఫార్మా షేర్ రూ.25.55 వద్ద ధర పలికింది.. ఆ తర్వాత ఇది 2022 మార్చి 17వ తారీకు కి రూ.404 కి చేరి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే కేవలం రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఏకంగా ఈ షేరు ధర పదిహేను వందల శాతం ర్యాలీ చేసి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. గత ఆరు నెలల నుంచి క్వాలిటీ ఫార్మా షేర్ పై అమ్మకాల ఒత్తిడి కూడా కొనసాగుతోంది. గత నెల రోజుల కాలంలో క్వాలిటీ ఫార్మా షేర్ ధర రూ.454 నుంచి రూ.404 కి దిగి రావడం గమనార్హం. అంటే ఇన్వెస్టర్లు 11 శాతం నష్టపోయారని చెప్పవచ్చు.
అయితే పోయిన ఏడాది ఇదే షేర్ ధర సుమారుగా సంవత్సర కాలంలోనే 52 రూపాయల నుంచి 404 రూపాయలకు ఎగిసింది. ఇక రెండు సంవత్సరాల కాలంలో  ఏకంగా 25 రూపాయల నుంచి 404 రూపాయలకు ర్యాలీ చేసింది. అంటే ఇక ఈ షేరు ధర ఎంత స్పీడ్ లో పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు..ఇక మీరు గనుక రూ.25 షేర్ ధర ఉన్నప్పుడు లక్ష రూపాయల విలువ చేసే షేర్ లు కొనుగోలు చేసి ఉండి ఉంటే ప్రస్తుతం దాని విలువ సుమారు రూ.16 లక్షలు అయి ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: