మనీ: రూ.10 వేల పెన్షన్ 10 యేళ్లు పొందాలంటే..?

Divya
సాధారణంగా యుక్త వయసులో ఉండి డబ్బు సంపాదించే వారు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఇక వారు రిస్క్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ రిటైర్మెంట్ అయిన సీనియర్ సిటిజన్ లు మాత్రం ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి కొద్దిగా భయపడతారు అని చెప్పవచ్చు. ఎందుకంటే చివరి వయసులో సంపాదించుకున్న డబ్బు మొత్తం పోతే.. సంపాదించడానికి వీలు ఉండదు.. కాబట్టి ఏదైనా పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం వల్ల వారు దాచుకున్న డబ్బు సురక్షితంగా ఉంటుంది అని భావిస్తుంటారు. ఇలా భావించడంలో తప్పులేదు అందుకే ప్రధానమంత్రి కూడా సీనియర్ సిటిజన్ల కోసం వయ వందన యోజన అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఇక ఇది సీనియర్ సిటిజన్లకు భద్రత కల్పిస్తుందని చెప్పవచ్చు. 60 సంవత్సరాలు దాటిన వారికి ఈ పథకంలో చేరే అర్హత లభిస్తుంది. మీరు గనక ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే సుమారుగా పది సంవత్సరాల పాటు పింఛన్ కు  హామీ కూడా ఉంటుంది. ప్రస్తుతం దీన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది కాబట్టి.. వార్షిక వడ్డీ రేటు కూడా 7.40 శాతానికి అందిస్తోంది. ఇకపోతే ఈ పథకంలో చేరడానికి మొదట 2020 మార్చి 31 మాత్రమే గడువు ఉండగా ప్రస్తుతం దానిని 2023 వరకు పొడిగించడం జరిగింది.
ముఖ్యంగా ఈ స్కీం కింద రూ.15 లక్షలు గరిష్ట పరిమితి కింద పెట్టవచ్చు. నెలవారీ పెన్షన్ రూ. 10,000 పొందాలి అంటే పది సంవత్సరాల పాటు సంవత్సరానికి 8 శాతం తో కూడిన వడ్డీ కూడా లభిస్తుంది. ఇకపోతే ఈ పథకం కింద మీరు ఏడాదికి 12 వేల రూపాయల పెన్షన్ పొందాలి అంటే కనీస పెట్టుబడి 1,56,658 రూపాయలను పెట్టుబడిగా పెట్టాలి. ప్రస్తుతం మీరు పది సంవత్సరాలకు గాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వదిలేస్తే ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలను పెన్షన్ కింద పొందే అవకాశం ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: