మనీ : పోస్ట్ ఆఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్.. ఏకంగా అన్ని లక్షలా ..!!

Divya
పోస్ట్ ఆఫీస్ ప్రస్తుతం తమ వినియోగదారులకు ఒక అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇకపోతే పోస్టాఫీసు ప్రవేశ పెట్టే పథకాలు వినియోగదారుడికి మంచి లాభాలను అందించడమే కాకుండా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా కాపాడతాయి. ఎవరైనా సరే 20 లక్షల రూపాయలను అతి తక్కువ సమయంలో సంపాదించవచ్చు.. అంటే వెంటనే ఆ పథకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.. అయితే మీరు కూడా ఇలా 20 లక్షల రూపాయలను సంపాదించాలి అనుకుంటే ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
అంతే కాదు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. కేవలం 150 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు నిర్ణీత కాల వ్యవధి ముగిసేసరికి సుమారుగా 20 లక్షల రూపాయలను పోస్ట్ ఆఫీస్ వారు మీకు అందిస్తారు. అయితే కేవలం పోస్ట్ ఆఫీస్ లోనే కాదు బ్యాంకు లలో కూడా ఈ పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఈ స్కీమ్ బ్యాంకులలో ఇటు పోస్ట్ ఆఫీస్ లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి కేవలం రోజుకు 150 రూపాయలు చొప్పున నెలకు 4,500 రూపాయలను మీరు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది..
ఇకపోతే 15 సంవత్సరాల కాలపరిమితి ఉన్న ఈ పథకంలో మీరు 15 సంవత్సరాల పాటు ప్రతి నెల 4, 500 రూపాయలను పెట్టుబడిగా పెట్టాలి. ఇకపోతే ఈ పథకంపై మీకు 7.1 శాతం వడ్డీ కూడా లభిస్తుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో వడ్డీ తో కలుపుకొని డబ్బులు రావడం జరుగుతుంది. ఈ పథకంలో గరిష్ఠంగా సంవత్సరానికి 1.5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే నెలకు సుమారు 12,500 రూపాయలను చెల్లించడం వల్ల 15 సంవత్సరాలు ముగిసేసరికి 7.1 శాతం వడ్డీతో కలుపుకొని ఏకంగా 20 లక్షల రూపాయలు వస్తాయి. ఇందులో పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: