మనీ: జన్ ధన్ ఖాతాలో డబ్బు జమ.. రూ.2 లక్షలు బెనిఫిట్ ..!

Divya
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తూ ప్రతి ఒక్కరి చేత జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లక్షల కొద్దీ ఖాతాలో డిపాజిట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ అకౌంట్లలో చూసుకుంటే రూ.1.5 లక్షల కోట్ల డబ్బు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే పేద వారి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఉచితంగా బ్యాంకు ఖాతాను తెరవడానికి అవకాశాన్ని కల్పించింది.. అయితే ఇందుకోసం కొన్ని షరతులను కూడా వర్తింపజేసేలా చేయడం గమనార్హం.
ఎవరైతే ఇతర బ్యాంకులలో అకౌంటు లేకుండా ఉంటారో అలాంటి వారికి జన్ ధన్ ఖాతా ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. మోదీ సర్కార్ ఈ పథకాన్ని గత ఏడు సంవత్సరాల కిందట ఆవిష్కరించిన విషయం తెలిసిందే.ఇక 2014 ఆగస్టు నెలలో ఈ స్కీంను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.. ప్రజలు ఈ జన్ దన్ అకౌంట్లలో డిపాజిట్లు చేసిన విలువ అక్షరాలా రూ.1.5 లక్షల కోట్లు. అంతేకాదు త్వరలోనే ఈ మార్కును అధిగమించబోతోందని కూడా అంచనాలు చెబుతున్నాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం చూసుకుంటే 44.23 కోట్ల జన్ దన్ అకౌంట్ లలో డిపాజిట్ విలువ 2021 డిసెంబర్ చివరి రోజుకు రూ.1.5 లక్షల కోట్లను అధిగమించింది అని సమాచారం. ఇక 44.23కోట్లు అకౌంట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అధిక వాటాను కలిగి ఉన్నాయని ఇక ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాతాల సంఖ్య 34.9 కోట్ల గా నమోదు చేయబడింది అని సమాచారం.. గ్రామీణ బ్యాంకుల్లో అయితే జన్ దన్ ఖాతాల సంఖ్య 8.05 కోట్లు ఉండగా ప్రైవేటు రంగ బ్యాంకులలో ఈ జన్ దన్ సంఖ్య 1.28 కోట్లుగా ఉన్నట్లు లెక్క తేల్చారు.ఈ  ఖాతా వల్ల రెండు లక్షల వరకు ఉచిత బీమా లభిస్తోంది. ఈ పథకంలో పదివేల రూపాయల వరకు డబ్బులు తీసుకొని మళ్ళీ కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ డబ్బులకు మనం వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: