మనీ: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతినెల రూ.5 వేలు..!!

Divya
సామాన్య ప్రజల యొక్క ఆదాయం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసులలో రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తోంది.ఈ నేపథ్యంలోనే పోస్టాఫీసుల్లో కూడా సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఎప్పటికప్పుడు సామాన్య ప్రజలకు చేరువలో ఉంటున్నాయి.ఈ పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఉండదు. పైగా రెట్టింపు స్థాయిలో మనకు డబ్బు అందుతుంది. చాలామంది పోస్టాఫీసులలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ముఖ్యంగా ఎంచుకునే స్కీమ్ స్మాల్ సేవింగ్ స్కీమ్.
ఇందులో మంత్లీ సేవింగ్ స్కీమ్ కూడా ఒకటి . మీరు మూడు నెలలకు లేదా ఆరు నెలలకు లేదా తొమ్మిది నెలలకు లేదా 12 నెలలకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందులో మీరు డబ్బులు ఇన్వెష్ట్ చేయాలి అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం యొక్క పూర్తి కాలవ్యవధి ఐదు సంవత్సరాలు. అయితే మీరు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనిష్టంగా వెయ్యి రూపాయల నుండి గరిష్టంగా 4.5 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బుకు ప్రతి నెలా వడ్డీ కూడా వస్తుంది.
ఈ పథకం ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది..ఒకవేళ జాయింట్ అకౌంట్ తీసుకున్నట్లయితే 9 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దీని కింద మీకు 6.6 శాతం వడ్డీ కూడా లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లను సవరిస్తుంది అందుకే మీకు వడ్డీ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబంలో భార్య భర్త ,అన్నా తమ్ముడు, అక్క చెల్లి ఇలా ఎవరైనా సరే ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ తీసుకున్నట్లయితే 9 లక్షల రూపాయలను ఒకేసారి డిపాజిట్  చేయాల్సి ఉంటుంది.
ఇలా ఇమేజ్ చేయడం వల్ల ఇద్దరికీ కలిపి సంవత్సరానికి 60 వేల రూపాయలు వస్తాయి..అంటే నెలకు ఐదు వేల రూపాయల చొప్పున తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: