మనీ: ఆ కార్డు ముట్టుకుంటే ఇక బాదుడే అంటున్న ఎస్బిఐ..!!

Divya
దేశీయ దిగ్గజం బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త రూల్స్ ను అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఎమ్ ఐ ఆప్షన్ లో మనం ఏదైనా కొనాలని అనుకుంటే.. అదనపు చార్జీలు తప్పవంటూ హెచ్చరిస్తోంది. చాలామంది క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ ఆప్షన్ లో తమకు నచ్చిన వస్తువులను ఎటువంటి చార్జీలు లేకుండా కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అటువంటి వారికి ఎస్బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ప్రతినెలా సమాన పద్దతిలో వాయిదా చెల్లింపుగా మార్చుకుంటే.. అటువంటి లావాదేవీలపై ఖచ్చితంగా రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు పన్ను కూడా వసూలు చేయనున్నట్లు ఎస్బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ తాజాగా ప్రకటించింది.

అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే నెల డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నట్లు బ్యాంకు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే ఎవరైతే ఎస్బిఐ బ్యాంకు ద్వారా క్రెడిట్ కార్డు తీసుకొని వినియోగిస్తున్నారో అలాంటి వారికి ఈ మెయిల్ ద్వారా కూడా ఈ విషయాన్ని పంపినట్లు అధికారులు వెల్లడించారు... అయితే  డిసెంబర్‌ 1కి ముందుగా ఎవరైనా ఈఎంఐ పద్ధతి ద్వారా క్రెడిట్ కార్డును ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేసి ఉండి ఉంటే, ఫీజు మినహాయింపు ఉంటుంది. కానీ  ఆ తేదీ తర్వాత ఈఎంఐ బుకింగ్‌ జరిగితే ప్రాసెసింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు ఉండదు.

కానీ డిసెంబర్ 1 తరువాత క్రెడిట్ కార్డ్ ఉపయోగించి వస్తువులు కొనుగోలు చేస్తే ప్రాసెసింగ్ ఫీజు తో పాటు పన్ను కూడా కట్టాల్సి ఉంటుంది అని ఎస్బిఐ స్పష్టం చేసింది. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ లు ఏం చేయాలో తెలియక , తమకు నచ్చిన వస్తువులను ఇప్పుడే కొనుగోలు చేసుకోవాలని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: