మనీ: టర్మ్ పాలసీ ఎంచుకునేటప్పుడు ఇలాంటి తప్పులు చేస్తున్నారా..?

Divya
సాధారణంగా చాలామంది భవిష్యత్తులో పూర్తి చేయాల్సిన లక్ష్యాలను, బాధ్యతను దృష్టిలో పెట్టుకుని వాటికనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు చేసుకుంటుంటారు.. అయితే మన జీవితం లో మనం ప్రతి దానిని కూడా పూర్తి స్థాయిలో ఊహించడం అనేది సాధ్యం కాదు.. కాబట్టి ఈ మార్గంలో ఎదురయ్యే ప్రతి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా కూడా సిద్ధంగా ఉండాలి.. ముఖ్యంగా మీరు మీ జీవితంలో చేయాల్సిన మొదటి పని ఏమిటంటే మీరు లేని సమయంలో కూడా మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే.. ఇది టర్మ్ పాలసీతో సాధ్యమవుతుంది అని అంటున్నారు నిపుణులు.
ఒక వ్యక్తి మరణాంతరం తర్వాత తమ కుటుంబానికి ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి.. అంటే చక్కని టర్మ్ పాలసీ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా  పాలసీ కొనుగోలు చేసేటప్పుడు చాలామంది చేసే తప్పుల గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం.
తగినంత జీవిత బీమా హామీ లేకపోవడం:
మనం బీమా చేసిన వ్యక్తి గనుక మరణిస్తే అతను లేదా ఆమె కుటుంబం ఆర్థికంగా వెనుకబడకూడదు అన్న ఒక ఉద్దేశంతోనే టర్మ్ పాలసీని కొనుగోలు చేస్తాము.. ఒకవేళ మనం తీసుకునే హామీ మొత్తం కుటుంబ భవిష్యత్ అవసరాలకు సరిపడా లేకపోతే మనం కొనుగోలు చేసిన లక్ష్యం కూడా నెరవేరదు.. కాబట్టి టర్మ్ పాలసీని ఎంచుకునేటప్పుడు మన మరణానంతరం కూడా మన కుటుంబ సభ్యులు భవిష్యత్తులో సంతోషంగా ఉండేలా టర్మ్ పాలసీని ఎంచుకోవాలి.
ప్రీమియం ఆధారంగా టర్మ్ పాలసీని ఎంచుకోవడం:
ఎవరైనా సరే టర్మ్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు పేరున భీమా సంస్థలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రీమియం హామీ మొత్తంతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చూసుకోవాలి.
పాలసీ కొనుగోలు చేసేటప్పుడు జాప్యం ఉండకూడదు:
వార్షిక ప్రీమియం ఉదాహరణకు మీరు 35 సంవత్సరాలలో హామీ మొత్తం కొనుగోలు చేస్తే రూ. 9వేల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.. అంటే కొనుగోలు ఆలస్యమయ్యే కొద్దీ ప్రీమియం కూడా ఎక్కువ అవుతుంది అనే విషయం గుర్తుంచుకోండి.
వివరాలను దాచిపెట్టడం, ఆదాయపు పన్ను కోసం పాన్ కార్డును సమర్పించకపోవడం ,  తక్కువ కాలపరిమితి వున్న టర్మ్ పాలసీని ఎంచుకోవడం వంటి తప్పులు చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: