మనీ: నెలకు రూ.1300 తో చేతికి రూ.40 లక్షలు..!!
ఇది ఒక ఎండోమెంట్ ప్లాన్ అని చెప్పవచ్చు.. లైఫ్ కవరేజ్ తోపాటు మెచ్యూరిటీ సమయంలో కూడా మీ పాలసీ డబ్బులను మీరు తిరిగి పొందవచ్చు. ప్రమాదవశాత్తు లేదా దురదృష్టవశాత్తు పాలసీదారుడు మరణిస్తే , నామినీ కి పాలసీ యొక్క డబ్బులు ఇవ్వడం జరుగుతుంది.. ఒక్కసారి జీవన్ ఉమాంగ్ పాలసీ లో కనుక తీసుకున్నట్లయితే పాలసీదారుడు కి వంద సంవత్సరాలు వచ్చే వరకు ఈ పాలసీ కవరేజ్ మనకు లభిస్తుంది.. ఉదాహరణకు 30 సంవత్సరాల వయసులో ఉన్నవారు రూ.5 లక్షల బీమా మొత్తానికి సుమారుగా ముప్ఫై సంవత్సరాల ప్రీమియం తో పాలసీ తీసుకుంటే నెలకు రూ.1280 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది..
ఇక ఈ టర్మ్ పాలసీని 15, 20, 25 సంవత్సరాల పరిమితి తో కూడా తీసుకోవచ్చు. ఇక మీరు 30 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత మీకు 60 సంవత్సరాలు వచ్చి ఉంటాయి.. ఇక మీకు ప్రతి ఏడాది రూ. 40 వేల రూపాయలు చేతికి లభిస్తాయి.. అంటే మీకు 99 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ డబ్బులు అందుతాయి.. 100 వ సంవత్సరంలోకి పడిన తర్వాత ఏఫ్.ఏ. బి, బోనస్, బీమా మొత్తం అన్నీ కలిపి రూ. 40 లక్షల వరకు మీ చేతికి వస్తాయి. అంటే బోనస్ కింద 17.6 లక్షలు లభిస్తే ఎఫ్ ఏ బీ కింద 17.7 లక్షలు లభిస్తాయి.. ఇక రూ.5 లక్షల భీమా మొత్తానికి 40 లక్షల రూపాయల వరకు మీరు పొందవచ్చు. అంతేకాదు పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు.