మనీ: కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ లేని రుణం పొందాలంటే ఇలా చేయండి..?

Divya
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా సహాయపడాలని రకరకాల ప్రయత్నాలను చేస్తోంది. ముఖ్యంగా సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ.. పేదలకు అండగా దండగా నిలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రకరకాల పథకాలలో ముద్ర యోజన పథకం కూడా ఒకటని అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఈ ముద్ర యోజన పథకం కింద లాభాలు పొందవచ్చునని,అయితే ఎలాంటి లాభాలు పొందవచ్చో మాత్రం చాలామందికి తెలియదు అని చెప్పాలి.. ముఖ్యంగా లోన్ పొందాలంటే అంటే రకరకాల సర్టిఫికెట్లను ఇస్తేనే బ్యాంకుల ద్వారా రుణం పొందే అవకాశం ఉంటుంది.

ముద్ర యోజన పథకం కింద కూడా 50 వేల రూపాయల నుండి లోన్ పొందే వెసులుబాటును కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని యోచిస్తున్నారో అలాంటి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తుంది. మీరు చేపట్టే వ్యాపార వృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది అన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క వ్యాపారస్తులు గుర్తుంచుకోవాలి. వడ్డీ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకొచ్చి, అసలుకు వడ్డీ కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడే సామాన్య ప్రజల కోసమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఇందులో ముద్ర యోజన పథకం కింద మూడు కేటగిరీల మనకు అందుబాటులో ఉన్నాయి. శిశు, తరుణ్, కిషోర్ అనే మూడు పద్ధతుల ద్వారా మనం డబ్బులను లోన్ కింద పొందవచ్చు. చిన్నతరహా, మధ్యతరహా ,పెద్ద తరహా వ్యాపారస్తులు..తమ  వ్యాపార అభివృద్ధి నిమిత్తం సుమారుగా 50 వేల రూపాయల నుంచి ఏకంగా 10 లక్షల రూపాయల వరకు ముద్ర లోన్ కింద డబ్బులను తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు కేవలం ఎలాంటి బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు అందుకు వ్యాపారానికి  సంబంధించిన ఒక దృవీకరణ పత్రము, ఐడెంటిటీ కార్డు ,రెండు ఫోటోలు , అడ్రస్ ప్రూఫ్ తో సమీపంలో ఉన్న ఎస్బిఐ బ్యాంకు లోకి వెళ్లి లోన్ అప్లై చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: