ధనవంతులుగా అవ్వాలనుకునేవారు ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించండి..

Purushottham Vinay
ఇక డబ్బు సంపాదించాలని ధనవంతులుగా మారాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాని రాత్రికి రాత్రే ఎవరూ కూడా పెద్ద ధనవంతులు కాలేరు. ఒకవేళ అయినా కాని వాళ్ళ అదృష్టం బాగుండి ఏదో లాటరీ తగిలితే తప్ప మాములుగా అవ్వలేరు. ఇక ధనవంతులుగా అవ్వాలంటే ఖచ్చితంగా మీరు డబ్బు ఆదా చేసే అలవాటును పెంచుకోవాలి. ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు మీరు ఆదా చేయలనుకున్నారు. అప్పుడు మీరు ఒకేసారి అంతా మొత్తాన్ని కూడా వెంటనే ఆదా చేయలేరు. కొంచెం కొంచెం కనుక ఆదా చేస్తే చివరికి మీరు లక్ష రూపాయల వరకు ఆదా చేయవచ్చు. అందుకే ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది.ఇక ఈ పెట్టుబడుల్లో ప్రతి ఒక్కటి కూడా దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటాయి.

ఇక డబ్బు విషయంలో మీరు చాలా తెలివిగా ఖర్చు పెట్టడానికి మీకు మంచి నైపుణ్యం ఉండాలి. అది ఉంటే కనుక మీరు దాని ద్వారా డబ్బును చాలా సంపాదించవచ్చు.ఇక మీరు దేనిలోనైనా బాగా అత్యుత్తమంగా ఉన్నప్పుడు మీకు అవకాశాలు అనేవి వస్తాయి. కాబట్టి మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకొని ఏదో ఒక నిపుణుడిగా మారడం అవసరం.

ఇక స్టాక్స్ ఇంకా షేర్లలో పెట్టుబడిని పెట్టండి.ఇలా కనుక మీరు మీ సుదీర్ఘ కాలంలో స్టాక్స్‌లో చిన్న పెట్టుబడులు కనుక పెట్టగలిగితే ఇక మీరు చాలా ఈజీగా మంచి సంపదను నిర్మించవచ్చు.కాని రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ స్టాక్స్ ఎల్లప్పుడూ కూడా రిస్క్‎కుతో కూడుకున్నవి.ఇక మీకోచ్చే జీతాన్ని బట్టి ఖర్చులు తగ్గించుకోండి. దీనికి మీ కోసం మీరు ఒక బడ్జెట్‌ను రూపొందించుకోండి. మీరు ఎంత సంపాదిస్తున్నారు. వచ్చిన అమౌంట్ లో ఎంత ఖర్చు చేస్తున్నారు. దాన్ని బట్టి మీ బడ్జెట్ ని సెట్ చేసుకోండి.ఇక అందువల్ల మీరు మిగిలి ఉన్నదాన్ని ఈజీగా ఆదా చేయవచ్చు.

ఇక అన్నిటికన్నా ముఖ్యం ఇది. ఏది పాటించిన పాటించకపోయినా ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. మీరు ధనవంతులు కావడానికి చాలా ఎక్కువ జీతం లేదా పెద్ద లాభదాయకమైన వ్యాపారాన్ని కలిగి ఉండటం అసలు అవసరం లేదు. మీకు వచ్చే తక్కువ జీతం ఇంకా అలాగే మీ వ్యాపారంలో వచ్చే చిన్న లాభాలతో మీ డబ్బును మీరు సరైన సమయంలో సరైన పద్ధతిలో సేవ్ చెయ్యడం ద్వారా మీరు కూడా ధనవంతులు కావచ్చు. పోస్టాఫీసులు ఇంకా బ్యాంకులు చాలా అంటే చాలా మంచివి. వీటిలో పొదుపు పథకాలు చాలా రకాలుగా వున్నాయి. అవేంటో తెలుసుకొని వాటిల్లో ఆ డబ్బును సేవ్ చెయ్యడం అనేది చాలా సులభమైన ఇంకా సురక్షితమైన ఎంపిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: