మనీ: రూ.10 లక్షలతో రూ.10 కోట్ల లాభం..ఎలా అంటే..?

Divya
ఏంటి..? రూ.10 లక్షలతో పది కోట్ల రూపాయల లాభం ఎలా పొందవచ్చు..? అసలు ఏ బ్యాంకులు ఇస్తాయి.. ఇదంతా సాధ్యమేనా..? ఇలా ఎన్నో ప్రశ్నలు మన మదిలో మెదులుతాయి.. నిజమే కేవలం పది లక్షల రూపాయల పెట్టుబడితో.. ఏకంగా పది కోట్ల రూపాయలను సంపాదించవచ్చు అని అంటున్నాయి కొన్ని బ్యాంకులు. ఇంతకూ ఆ బ్యాంకు లేవి..? ఎలా మనకు ప్రాఫిట్ లభిస్తుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

అతి తక్కువ సమయంలో ఎవరైనా డబ్బులు రెట్టింపు స్థాయిలో లేదా ఎక్కువ మొత్తంలో పొందాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అందుకు సిద్ధంగా ఉంటాయి. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంచెం రిస్క్ తీసుకున్నప్పటికీ అధిక మొత్తంలో డబ్బులు పొందవచ్చు. మ్యూటువల్  ఫండ్స్ లో భాగంగానే ఈక్విటీ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల తప్పకుండా భారీ మొత్తంలో మనం డబ్బులను పొందవచ్చు. మార్కెట్లో కూడా పలురకాల మల్టీ బ్యాగర్ షేర్లు ఇన్వెస్టర్లకు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

వీటిల్లో ముఖ్యంగా పేరుగాంచిన ప్రైవేట్ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్ కూడా ఉంది.. కాబట్టి ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల రాబడి బాగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంకు లో ఉన్న మల్టీ బ్యాగర్ షేర్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి పొందినట్లు బ్యాంకు వివరాలు తెలుపు తున్నాయి. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంకు లో ఒక షేరు ధర సుమారుగా రూ.1966 ఉండగా..20 సంవత్సరాల కిందట ఇదే ఒక్కొక్క షేర్.. రూ.1.94 మాత్రమే వుండేది. సుమారుగా 2001వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీ నాటికి ఈ రేటు పలికింది అన్నమాట.. అయితే ఇప్పుడు అదే రేటును చూసుకుంటే సుమారుగా 1011 రెట్లు అధికంగా పరుగులు పెట్టింది. ఇంకెందుకు ఆలస్యం ఈ షేర్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి, అతి తక్కువ సమయంలోనే కుబేరులు అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: