మనీ : ప్రతినెలా రూ.5,400 ఆదాతో రూ.2 కోట్లు లాభం..

Divya
ఎవరైతే అతిత్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారో, అలాంటివారు వృద్ధాప్యంలో డబ్బు సమస్య లేకుండా సంతోషంగా గడపవచ్చు. అందుకే చాలామంది ఇప్పటినుంచే పెట్టుబడి పెడుతూ డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ డబ్బులు పెట్టాలి , తర్వాత అధిక మొత్తంలో డబ్బులు పొందాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మీరు కూడా లక్షాధికారి కావాలని అనుకుంటే, స్టాక్ మార్కెట్ , మ్యుచువల్ ఫండ్స్ లాంటివి సరైన మార్గాలు అని చెప్పవచ్చు.
కానీ అలాంటి వాటిలో కొంచెం రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన మరొక స్కీం నేషనల్ పెన్షన్ సిస్టమ్. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది మార్కెట్ లింక్ రిటైర్మెంట్ సంబంధించిన పెట్టుబడు లలో ఒకటి. ఈ పథకం ప్రభుత్వ బ్యాంకు తో పాటు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా డబ్బులు పెట్టుబడి పెడుతుంది.. ఇందులో మీరు చేరేటప్పుడు ఏ బ్యాంకు కి ఎంత పెట్టుబడి పెట్టాలో కూడా మీరే నిర్ణయించుకోవచ్చు.
ఇక ముఖ్యంగా ఎవరైతే ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా లక్షలాదికారి కావాలనుకుంటున్నారో..? అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని అనుసరించవచ్చు. ఉదాహరణకు మీకు 25 సంవత్సరాలు ఉన్నాయని అనుకుందాం.. ఇప్పుడు మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి సరైన వయసు. ఇందుకోసం మీరు ప్రతి నెల రూ. 5,400 పెట్టుబడి కింద పెట్టండి. అంటే ప్రతి రోజు 180 రూపాయలు ఆదా చేయాల్సి ఉంటుంది. మీ పదవీ విరమణ కాలం 60 సంవత్సరాలు కాబట్టి మీరు ఇందులో 35 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు నిర్దిష్ట కాలం ముగిసిన తర్వాత మీకు మొత్తం పెన్షన్ కింద 2.2 కోట్ల రూపాయలను పొందవచ్చు .అంతేకాదు 10 శాతం రాయితీ కూడా వెనక్కి వస్తుంది.. ఇందులో మీరు 35 సంవత్సరాలలో రూ.22.68 లక్షలు పెట్టుబడి పెడతారు. అన్నమాట. మీకు రూ. 1.79 కోట్లు వడ్డీ లభిస్తుంది. పన్ను కూడా  ఉండదు కాబట్టి రూ.6.80 లక్షలు ఆదా చేసుకోవచ్చు. ఇక మొత్తం కలిపి చూసుకుంటే మీకు 35 సంవత్సరాలలో రూ. 2.02 కోట్లు అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: