మనీ : నెలకు రూ.1345తో కొత్త బైక్ మీ సొంతం..

Divya
ప్రస్తుత కాలంలో పెట్రోల్ , డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇక బస్ ఛార్జీలు, ట్రైన్ ఛార్జీలు , ఆటో ఛార్జీలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ ఛార్జీలు ఎక్కువ అవ్వడం వల్ల సామాన్య ప్రజలు ఈ ఛార్జీలను ఇవ్వలేకపోతున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే ప్రతి ఒక్కరూ ఒక సొంత బైక్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక బైక్ కొనాలి అంటే అది సుమారుగా లక్ష రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే ఈ లక్ష రూపాయలు పెట్టి బైక్ కొనాలి అంటే చాలామంది దగ్గర డబ్బులు ఉండవు. అలాగని ఛార్జీలు చెల్లించలేక సతమతమవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారి కోసమే ఒక బంపర్ ఆఫర్..

ఇక ప్రస్తుత కాలంలో ఎక్కువ మైలేజ్ ను ఇచ్చే  వాహనాలను కొనుగోలు చేస్తే చాలా బాగుంటుంది . ఇక అందులో ముఖ్యంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలలో హెచ్ఎఫ్ డీలక్స్ 100 బైక్ అయితే చాలా బాగుంటుంది . ఇది ఎక్కువ మైలేజ్ ను ఇస్తుంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఈ బైకు రూ.60 వేల పైనే ధర పలుకుతోంది. అయితే ఇందుకోసం మీరు  డౌన్ పేమెంట్ కింద రూ.55 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కావాలంటే, ఈ మొత్తానికి మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. దీనిపైన 9.2 శాతం వడ్డీ కూడా పడుతుంది.

ఒకవేళ ముప్పై రెండు నెలల్లోనే లోన్ తీర్చాలంటే, సుమారుగా నెలకు రూ. 1949 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒకవేళ 60 నెలలకు చెల్లించాల్సి వస్తే నెలకు రూ. 1345 రూపాయలను  చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ కింద లోన్ చెల్లించడం వల్ల తక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఇక సొంత బైక్ ఉందనే ఆనందం కూడా లభిస్తుంది. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ ఈఎమ్ఐ  చెల్లిస్తూ మంచి బైక్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇక అంతే కాదు బస్సులు, రైళ్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: