మనీ : మహిళలకు గుడ్ న్యూస్.. రూ.4 లక్షలు మీ అకౌంట్లో..

Divya
ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పురుషులతో పోల్చుకుంటే.. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, వారికి తగిన సహాయం చేయాలని, ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా సరి కొత్త పథకాన్ని కేవలం మహిళలకు మాత్రమే తీసుకొచ్చింది ఎల్ఐసి. అది దేశీయ దిగ్గజ బ్యాంక్ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..
ఎల్ఐసి అందరిని దృష్టిలో పెట్టుకొని , ప్రతి వర్గం కోసం ఒక ప్రత్యేక పాలసీని అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇక అలా  ప్రవేశపెట్టిన ఎన్నో స్కీం లలో ఎల్ఐసి మహిళల కోసం కూడా, ఒక ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే మహిళలు ఈ పథకంలో చేరి , ప్రతిరోజు 29 రూపాయల చొప్పున పొదుపు చేయడం వల్ల, అతి తక్కువ కాలంలోనే రూ.4  లక్షల రిటర్న్స్ పొందవచ్చు. ఇక ఆ పథకం పేరు "ఆధార్ శిల" . ఇక ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకం. ఇందులో 29 రూపాయలను రోజుకు పొదుపు చేస్తూ, అలా ఇరవై సంవత్సరాల పాటు చెల్లించాలి. అయితే ఇరవై సంవత్సరాలలో మీరు చెల్లించే మొత్తం రూ. 2,14,696 అవుతుంది. ఇక పెట్టుబడికి 20 సంవత్సరాల తర్వాత రూ. 4  లక్షల రిటర్న్స్ కూడా లభించడం విశేషం.
ఇందులో నిర్దిష్ట వయస్సు 8 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు అర్హులు. ఇందులో కనిష్టంగా 10 సంవత్సరాలకు పాలసీ తీసుకోవడం ఉత్తమం. గరిష్టంగా ఇరవై సంవత్సరాలకు పాలసీ తీసుకోవచ్చు. ఇక ఇందులో మీరు నెలకు లేదా మూడు నెలలకు లేదా ఆరు నెలలకు లేదా ఏడాదికి పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు. ఇందులో చేరడానికి మహిళ కు ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి. ఇక ఎటువంటి ఆరోగ్య పరీక్షలతో  సంబంధం లేకుండానే పాలసీని తీసుకోవచ్చు. ఎవరైతే పాలసీ తీసుకున్న వారు ఐదు సంవత్సరాల లోపు మరణిస్తే ,  సమ్ అష్యూర్డ్ 110% కూడా లభిస్తాయి. అంతేకాదు అత్యవసర పరిస్థితులలో ఆరోగ్య సంబంధించిన చికిత్స ఖర్చులు కూడా ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: