మనీ : రూ.7 ఆదాతో ప్రతి నెల రూ.5 వేలు మీ సొంతం.
ప్రతి నెలా కొంత డబ్బు సంపాదించాలని, అలా సంపాదించిన డబ్బు లో కొంతభాగం దాచుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ఈ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎన్నో స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక అదే విధంగానే ఇప్పుడు మీకోసం ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో చేరితే ప్రతినెల రూ.5,000 వరకు నగదు పొందవచ్చు. అయితే దీనికోసం మీరు ప్రతి నెల ఎంత కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నోరకాల పథకాలలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇందులో చేరితే ప్రతి నెల డబ్బులు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే డబ్బు ఆదా చేసుకోవాలనుకుంటున్నారో? అలాంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశం. పీ ఎఫ్ ఆర్ డి ఏ ఈ స్కీం యొక్క బాధ్యతలు చూసుకుంటుంది. అయితే ఇందులో చేరాలంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారై ఉండాలి. అలాగే ఆధారం నెంబర్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి. అందులోనూ ముఖ్యంగా దేశీయ అతిపెద్ద బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతర ప్రాంతీయ బ్యాంకులు కూడా అటల్ పెన్షన్ యోజన అకౌంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి.
ఈ పథకంలో చేరిన వాళ్ళు నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు పెన్షన్ పొందవచ్చు. ఇక మీరు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే చేరితే నెలకు రూ.210 చెల్లిస్తే,అంటే రోజుకు ఏడు రూపాయలు ఆదా చేయడం వల్ల మీకు ప్రతినెలా ఐదు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది . ఇక అదే మీకు రూ.1000 పెన్షన్ కావాలంటే, నెలకు నలభై రూ.42 కడితే సరిపోతుంది.
ఒకవేళ నెలకు 2000 రూపాయల పెన్షన్ కావాలనుకొనే వారికి, ప్రస్తుతం నెలకు 84 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎంత మొత్తంలో పెన్షన్ కావాలనుకుంటే, అందుకు తగ్గట్టుగా ప్రతినెలా మీరు చెల్లించే నెలవారి మొత్తం ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు నెలకు రూ.5000 పెన్షన్ పొందాలనుకుంటే మీరు ప్రతి నెల రూ.210 కట్టాల్సి ఉంటుంది.