మనీ : మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా..? అయితే రూ.50 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చట..
గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా..?ఇది ఏమి ప్రశ్న.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా ఉండేది గ్యాస్ సిలిండరే కదా.. గ్యాస్ సిలిండర్ లేకపోతే వంట చేసుకోలేము. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది.. అయితే మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రమాద భీమా కవరేజ్ ను అందిస్తున్నాయి.. అది ఏమిటో..దాని వివరాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం..
దిగ్గజ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, వినియోగదారులకు ప్రమాద బీమా కవరేజీ అందిస్తున్నాయి. ఇందులో ప్రమాదవశాత్తు గ్యాస్ పేలుడు సంభవించిన సమయంలో ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అంటే మొత్తం ఏకంగా రూ. 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. అయితే ఈ బీమా ప్రయోజనం అందుబాటులో ఉన్నప్పటికీ దీని గురించి పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు.. ఎందుకంటే ఈ భీమా కవరేజ్ గురించి గ్యాస్ కంపెనీలు గానీ ప్రభుత్వం గానీ ఎవరూ కూడా ప్రచారం చేయరు. అందుకే ప్రజలకు దీని గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు.. ముఖ్యంగా ఇలాంటి భీమా సౌకర్యం ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు..
ఇందులో ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీలతో పెట్రోలియం కంపెనీలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం సంస్థలు ఐసిఐసిఐ లాంబార్డ్ ద్వారా ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. అయితే ప్రమాదవశాత్తు సిలిండర్ పేలినప్పుడు ఈ రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ను ఎలా పొందాలి అంటే.. mylpg.In వెబ్సైట్ ప్రకారం ఎల్పీజీ కనెక్షన్ తీసుకున్నవారు గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదానికి గురి అయితే రూ. 50 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు అంటే ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. అయితే గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది..
అలాగే ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ లకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి. ఇక గ్యాస్ కంపెనీలు,డిస్ట్రిబ్యూటర్లు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. ఈ పాలసీ ఒక్కొక్కరి పేరు పై ఉండదు. కాబట్టి అందరికీ వర్తిస్తుంది. ఇక ఇందుకోసం కస్టమర్లు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రమాదం జరిగి ప్రాణాపాయం సంభవించినట్లయితే ఎఫ్ఐఆర్,మెడికల్ ట్రీట్మెంట్, ప్రిస్క్రిప్షన్,మెడికల్ బిల్స్, పోస్టుమార్టం రిపోర్ట్,డెత్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
ఇక వినియోగదారులతో ఎటువంటి సంబంధం లేకుండా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఇన్సూరెన్స్ కోసం ఆ కంపెనీలే క్లేయిమ్ చేస్తాయి. తద్వారా ఎంతమేర ప్రమాదం జరిగిందో తెలుసుకొని అందుకు తగ్గట్టు పరిహారం కూడా అందిస్తాయి...