డబ్బే డబ్బు : చిన్న మదుపర్లకు పెద్ద అవకాశం !

Seetha Sailaja
చిన్న మదుపర్లు ఇక పై ప్రభుత్వ సెక్యూరిటీలు జి-సెక్ లలో నేరుగా పెట్టుబడులు పెట్టవచ్చు ఇందుకోసం రిజర్వ్ బ్యాంక ఆఫ్ ఇండియా దగ్గర ఒక గిల్ట్ సెక్యూరిటీస్ ఖాతాను తెరచి దాని ద్వారా లావాదీవీలు నిర్వహించుకోవచ్చు అని వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించిన త్వరలో రిజర్వ్ బ్యాంక్ ప్రకటించబోతోంది. ఇలాంటి అవకాశం కలగచేస్తున్న ఆసియా దేశాలలో తొలి దేశంగా భారత్ నిలవబోతోంది.

ఈ విధానం వల్ల బ్యాంక్ డిపాజిట్లు ఏమీ తగ్గవని మరొక విధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 12 లక్షల కోట్ల భారీ ఋణ సేకరణకు ఈ కొత్త విధానం సహకరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయ పడుతోంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈ వారానికి సంబంధించి నేటితో మొదలయ్యే సెన్సెక్స్ కదలికలు బట్టి షేర్ మార్కెట్ ఏతీరున పరుగులుపెడుతుంది అన్న అంచనాలకు రావచ్చు.

ప్రస్తుతం భారత్ లో ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ పై నిషేధం కొనసాగుతున పరిస్థితులలో రిజర్వ్ బ్యాంక్ దీనికి సంబంధించి ప్రత్యేక డిజిటల్ కరెన్సీని తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం డిజిటల్ కరెన్సీకి సంబంధించిన విధి విధానాలు త్వరలో ప్రకటించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈ విషయాల పై ఒక అంతర్గత కమిటీ పని చేస్తోందని త్వరలోనే ఆర్ బి ఐ నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు.

సెన్సెక్స్ 50,732 పాయింట్లు నిఫ్టీ 14,924 పాయింట్లు చేరుకున్న షేర్ మార్కెట్ ఈవారం తీసే పరుగుల పై మదుపర్ల స్పందన ఉంటుంది. రాబోయే రోజులలో ఆహార పంటల ధరలు తగ్గుతాయని జీడీపీ వృద్ధి 10.5 శాతం ఉంటుదని రిజర్వ్ బ్యాంక్ గవర్వర్ శక్తి కాంత దాస్ చెపుతున్న పరిస్థితులలో నిజంగానే ఈ అంచనాలు నిజమైతే భారతః ఆర్ధిక వ్యవస్థ కోలుకునే ఆస్కారం ఉంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే పెరుగుతున్న పెట్రోల్ డీసిల్ ధరలు వల్ల ఒక సగటు వాహన దారుడు గత 6 సంవత్సరాలలో అదనంగా 18 చెల్లించుకున్నాడు అని వస్తున్న అంచనాలతో త్వరలోనే మన తెలుగు రాష్ట్రాలలో కూడ పెట్రోల్ లీటర్ ధర 100 రూపాయలకు చేరే ఆస్కారం ఉంది అని వస్తున్న అంచనాలు సగటు మనిషిని ఖంగారు పెడుతున్నాయి..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: