డబ్బే డబ్బు : సహకారంతోనే సంపద !

Seetha Sailaja


ప్రస్థుతం మనం జీవిస్తున్న కాలాన్ని సహకార యుగంగా పరిగణిస్తున్నారు. వ్యాపార రంగంలో పారిశ్రామిక రంగంలో రాజకీయ రంగంలో ఇప్పుడు ఏ వ్యక్తి రాణించాలి అన్నా ఎదుటి వ్యక్తుల సహకారం లేనిదే కుదరదు. ఇక వ్యాపారంలో అయితే ప్రతిరోజు ఎదో ఒక రెండు కంపెనీల విలీనం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.


ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక కంపెనీ మరిన్ని విజయాలు సాధించాలి అంటే తమలా ఏకీకరణ ఉద్దేశ్యాలు ఉన్న వ్యక్తుల వైపు సంస్థల వైపు అడుగులు వేస్తున్నారు. భవిష్యత్ లో విజయం సాధించాలి అంటే సహకారాన్ని ప్రోత్సహించ వలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సహకారం కేవలం మన సహా ఉద్యోగుల నుంచి మాత్రమే కాదు మన కుటుంబం నుంచి మన ఇరుగుపొరుగు వారి దగ్గర నుంచి చివరకు ప్రభుత్వ అధికారుల వరకు ఒక వ్యక్తికి మిగతా వ్యక్తుల సహకారం లేనిదే రాణించలేడు.


ఆఖరికి కార్పోరేట్ సంస్థలు ప్రభుత్వాలు అనేక అంతర్జాతీయ ఏజన్సీలను కలుపుకుంటూ తమ అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ సహకరించుకోవడం వల్ల నేడు ప్రపంచం ఒక చిన్న పల్లెగా మారిపోయి ఎక్కడ ఏది జరిగనా క్షణాలలో తెలిసిపోవడమే కాకుండా పరస్పర సహకారంతో వ్యక్తులతో పాటు కంపెనీలు కూడ తమ ఎదుగుదలకు మార్గాలు సుగమం చేసుకుంటున్నాయి. ఉత్సాహం చొరవ నాయకత్వం ఇలా ఎన్ని లక్షణాలు ఉన్నప్పటికీ సహకరించే లక్షణం లేకపోతే ఒక వ్యక్తి కానీ లేదంటే ఆ వ్యాపార సంస్థ కాని నేటి పోటీ వ్యాపారంలో ఎదగలేదు.


వాస్తవానికి ఏవ్యక్తి అయినా ప్రమాదకరమైన వ్యక్తిత్వం గల వ్యక్తికి సహకారం అందించడు. అందువల్ల వ్యక్తిత్వం లేని వ్యక్తి అయినా కార్పోరేట్ వ్యవస్థ అయినా సహకార లక్షణాలకు దూరంగా ఉంటే అవి రాణించరు. అందువల్లనే ఆచరణాత్మకంగా ఉంటూ నిరంతరం సహకరించగల వ్యక్తులకు మాత్రమే విజయంతో పాటు ఐశ్వర్యం కూడ లభిస్తుంది. అందుకనే  ప్రతి వ్యక్తి సహకరించే మనస్తత్వం కలిగి ఉండాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: