అఖిల్ కోసం నాగార్జున చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇన్నాళ్లు కథల కోసం జల్లెడ పట్టాడు. సరైన దర్శకుడు ఎవరైతే బావుంటుందా? అని వేచి చూశారు. అఖిల్ ఎంట్రీ ఏ డైరెక్టర్‌తో అయితే బావుంటుందో? నిర్ణయించుకోలేనంత కన్ఫ్యూజన్. అయినా నాగార్జున పట్టువీడలేదు. చైతన్య కెరీర్లో జరిగింది అఖిల్ కెరీర్లో ససేమిరా జరగకూడదు అనుకున్నారు. అందుకే ఇప్పటికే సీనియర్ దర్శకులందరితో మంతనాలు చేస్తున్నారు. ఒకటో సినిమాతోనే కొట్టాలి! అని అఖిల్‌కి నూరిపోసిన నాగార్జున అందుకు తగ్గట్టుగానే స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌తో కమిట్మెంట్ తీసుకున్నారు. అఖిల్ మొదటి సినిమాకి వినాయక్ దర్శకత్వం వహించడానికి రెడీగా ఉన్నాడు.
అయితే అంతటితో సరిపుచ్చక ఇంకా ఏం దారులున్నాయా? అని వెతుకుతున్నారు నాగ్. కేవలం మొదటి సినిమాపైనే గురి పెట్టలేదు. అఖిల్‌ని పదేళ్ల పాటు ఖాళీ అనే పదమే లేకుండా బిజీ అయిపోయేంత మంది దర్శకుల్ని లైన్లో పెడుతున్నారు. పనిలో పనిగా స్టార్ రైటర్ కం డైరెక్టర్ త్రివిక్రమ్‌తోనూ మంతనాలు సాగిస్తున్నాడు. అవసరమైతే మహేష్‌ని ఒప్పిస్తా. కాస్త ఆగమని చెబుతా. అఖిల్‌తో ఓ సినిమా చెయ్ అని నాగ్ త్రివిక్రమ్‌ని అడిగారట. అంతేకాదు.. త్రివిక్రమ్ వెంట క్యూలో ఉన్న నిర్మాతల్ని కూడా ఆపే పనిలో ఉన్నాడట. ఇలా ఏ తండ్రీ పడనంత తాపత్రయం నాగార్జున పడుతున్నాడు. ఓ తండ్రిగా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. గ్రేట్ కదూ!
మరింత సమాచారం తెలుసుకోండి: