కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్దార్ద్..!?

Anilkumar
లోక నాయకుడు కమలహాసన్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ టు సినిమా త్వరలోనే రాబోతోంది. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ ఇండియన్ టు సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ మాట్లాడుతూ ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమంలోనే చాలా గొప్ప సినిమా అవుతుందని భావిస్తున్నాను. 

శంకర్ వంటి ఒక గొప్ప దర్శకుడు దగ్గర 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది .ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను .అంటూ వెల్లడించాడు సిద్ధార్థ్ .కమలహాసన్ నాకు ఎంతో ఇష్టమైన హీరో అని కమలహాసన్ గారు తనకు మానసిక గురువు అంటూ తెలిపారు .దూరం నుంచి తాను కమలహాసన్ గారిని చూస్తూ ఎన్నో విషయాలను నేర్చుకున్నానని నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడు అని చెప్పాడు సిద్ధార్థ్ .ఇలా గురువుగారితో కలిసి సినిమా చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. కమలహాసన్ గారితో కలిసి సినిమా చేయడమే నా కల.

ఈ సినిమాతో నా కల నెరవేరింది అంటూ తెలిపాడు సిద్ధార్థ్ .ఇందులో భాగంగానే సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు మీరు ఈ సినిమా గురించి ఎంత ఊహించుకున్నారో దానికి మించేలా ఈ సినిమా ఉండబోతోంది. అంటూ ఈ సినిమాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను చేశాడు సిద్ధార్థ్. దీంతో సిద్ధార్థ చేసిన ఏ కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక కమలహాసన్ నటిస్తున్న ఇండియన్ టు సినిమాను శంకర్ సరికొత్త ధోరణి లో తెరకెక్కిస్తున్నాడట. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: