టీజర్: కొరియన్ కనకరాజుగా భయపెడుతున్న వరుణ్ తేజ్..!
తనదైన మార్క్ యాక్షన్ ,హర్రర్ తో ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. టీజర్ గ్లింప్స్ విషయానికి వస్తే కమెడియన్ సత్య ను కొరియన్ పోలీసులు చితకబాదుతూ కనకరాజు ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉండగా.. సత్య అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని సత్య చెప్పే డైలాగులు నవ్వులు తెప్పించేలా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత హీరోయిన్ రితికా నాయర్ ఎంట్రీతో మరింత ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఆ వెంటనే డ్రాగన్ బొమ్మతో ఉన్న ఏదో ఒక మిస్టరీ బాటిల్ క్యూరియాసిటీని మరింత పెంచేలా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ ఎంట్రీ కూడా పక్క మాస్ ఎంట్రీగా చూపించారు. ముఖ్యంగా చేతి పైన త్రిశూలం, డమరుకం ట్యాటోలతో పాటు లుంగీ కట్టి లాంగ్ హెయిర్ తో వరుణ్ తేజ్ ను కొత్తగా చూపించారు డైరెక్టర్ మేయర్లపాక గాంధీ.
చివరిలో నీలి కళ్ళతో బెంచ్ పై కూర్చుని కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ భయపెట్టేలా కనిపిస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్ కూడా ఈ టీజర్ గ్లింప్స్ కి టాయిలెట్ గా నిలిచింది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ గత చిత్రాలలో ఉండే కామెడీకి ఈ సారి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఈసారి సక్సెస్ అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.