నేను నటుడిగా మారడానికి.. కారణం అదే : రానా

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు దగ్గుబాటి వారసుడు రామానాయుడు.. అదేనండి మన రానా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఇక తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే కేవలం హీరోగా మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు అని చెప్పాలి.

 ఇక రానా ఏదైనా పాత్రలో కనిపించబోతున్నాడు అంటే చాలు ఆ పాత్రకి ప్రాణం పోసి అదరగొడతాడు అని నేటి రోజుల్లో ప్రేక్షకులు అందరూ కూడా అనుకుంటున్నారు. ఇక బాహుబలి సినిమాలో బళ్లాలదేవుడిగా నటించి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. మొన్నటికి మొన్న బాబాయి వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్లో నటించాడు ఈ దగ్గుపాటి వారసుడు. అయితే ఇక  తాత రామానాయుడు, తండ్రి సురేష్ బాబు నిర్మాణ రంగంలో ఉంటే ఇక సురేష్ బాబు తనయుడు రానా మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 నిర్మాతగా కాకుండా నటుడిగా మారడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు రానా. ఇటీవల  ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన కెరీర్ లోని కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. నిర్మాతగా తాను అనుకున్నది జరగకపోవడంతోనే నటుడుగా వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు రానా . నిర్మాతగా కొనసాగిన సమయంలో పెద్ద సవాళ్లు ఎదుర్కొన్నాను అంటూ తెలిపాడు. తాను నిర్మాతగా వ్యవహరించిన మొదటి సినిమా బొమ్మలాట. ఈ సినిమాకు అవార్డులు వచ్చాయి. కానీ థియేటర్లో మాత్రం విడుదల కాలేదు అంటూ తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ విషయం తెలిసి.. రానా మంచి నిర్ణయం తీసుకున్నాడు.. లేదంటే ఒక మంచి నటుడుని ఇండస్ట్రీ మిస్ అయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: