ఆ స్టార్ హీరోయిన్ తో నాకు బలవంతంగా పెళ్లి చేశారు.. మంచు మనోజ్..!?

Anilkumar
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తర్వాత తన ఇద్దరు కొడుకులు సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయారు. ఇక ఈ విషయంలో మంచి ఫ్యామిలీ పై చాలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు నేటిజన్స్. ఈ ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఈ విషయంపై స్పందించిన మంచు విష్ణు పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆపడం లేదు. ఇదిలా ఉంటే ఇక ఈ మధ్యకాలంలో మంచు మోహన్ పొలిటిషన్ అయిన భూమ మౌనికని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి కాకముందు నుండి వీరిద్దరిపై ఎన్ని రకాల వార్తలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

మంచు విష్ణుకి ఈ పెళ్లి ఇష్టం లేదని మోహన్ బాబుకి పెళ్లి ఇష్టం లేదని అందుకే మంచు లక్ష్మి దగ్గర ఉండి మంచి మనోజ్ పెళ్లి చేయించిందంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదు అని కేవలం మంచు విష్ణుకు మాత్రమే ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో మిగతా వాళ్ళందరూ కలిసి వారి పెళ్లి చేయించారని తెలుస్తోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్.. మౌనిక కంటే ముందే తనకి ఒక స్టార్ హీరోయిన్ తో బలవంతంగా పెళ్లి చేశారు అంటూ ఒక షాకింగ్ నిజాన్ని బయట పెట్టాడు. ఇక అసలు విషయం ఏంటంటే ..

సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోయిన్ తాప్సి మరియు  మనోజ్ ఇద్దరు ప్రేమించుకున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి .అంతేకాదు కొంతమంది థంబ్ నెయిల్స్ సృష్టించి మరి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది అంటూ ఫోటోలని ఎడిట్ చేసి కూడా పెట్టారు .తాజాగా ఈ విషయంపై స్పందించిన మంచు మనోజ్ నాకు బలవంతంగా హీరోయిన్ తాప్సి తో పెళ్లి చేశారు అంటూ నవ్వుతూ చెప్పాడు. ఇక ఈ పెళ్లి వార్తలు వచ్చినప్పుడు నేను తాప్సీ ఎంతలా నవ్వుకున్నామో చెప్పలేము అంటూ ఆ వార్తలు పై క్లారిటీ ఇచ్చాడు మంచు మనోజ్. దీంతో మనోజ్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: