నా పెళ్లి తాప్సీతో అప్పుడే జరిగింది :: మంచు మనోజ్

murali krishna
మంచు ఫ్యామిలీ నుండి మోహన్ బాబు తర్వాత తన ఇద్దరు కొడుకులు సినిమాల్లో సక్సెస్ అవ్వలేకపోయారు. ఇక చాలామంది మిగతా హీరోల అభిమానులు ఈ విషయంలో మంచు ఫ్యామిలీ పై ట్రోల్స్ చేస్తూనే ఉంటారు.అయితే గతంలో అయితే మంచు ఫ్యామిలీ పై ఎన్ని ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ ట్రోల్స్ పై స్పందించిన మంచు విష్ణు పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అది చేస్తా ఇది చేస్తానని ఎంత బెదిరించినా సరే నేటిజన్స్ మాత్రం ఆయన మాటలు పట్టించుకోకుండా ట్రోల్ చేస్తూనే ఉన్నారు.మరీ ముఖ్యంగా మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా అలాగే మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో ఈ ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి.
అయితే ఈ మధ్యకాలంలో మంచు మనోజ్  పొలిటిషన్ అయినా భూమా మౌనికని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరి పెళ్లి టైం లో ఎన్ని వార్తలు వినిపించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మోహన్ బాబుకి మంచు విష్ణుకి పెళ్లి ఇష్టం లేదని,అందుకే మంచు లక్ష్మి పెళ్లి చేస్తుంది అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి.కానీ అలాంటిదేమీ లేదు కేవలం మంచు విష్ణుకు మాత్రమే ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నట్లు ప్రవర్తించాడు. మిగతా వాళ్ళందరూ ఆనందంగానే ఈ పెళ్లిలో పాల్గొన్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు మనోజ్ మౌనిక కంటే ముందే తనకి వేరే హీరోయిన్ తో బలవంతంగా పెళ్లి చేశారు అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. ఇక అసలు విషయం ఏమిటంటే మంచు మనోజ్ తాప్సీ కాంబినేషన్లో ఝుమ్మంది నాదం సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో తాప్సి మనోజ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తర్వాత చాలామంది నేటిజన్స్ సోషల్ మీడియాలో తాప్సి మంచు మనోజ్ ఇద్దరు ప్రేమించుకున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని కామెంట్స్ పెట్టారు.
అంతే కాదు కొంతమంది యూట్యూబ్లో థంబ్ నెయిల్స్ సృష్టించి వీళ్లిద్దరూ దండలు మార్చుకున్నారని వీరి ఫోటోలు ఎడిట్ చేసి పెట్టారు. అయితే ఈ విషయంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించి నాకు బలవంతంగా హీరోయిన్ తాప్సి  తో పెళ్లి చేశారు. అయితే ఈ పెళ్లి వార్తలు వచ్చినప్పుడు తాప్సి నేను ఎంతగా నవ్వుకున్నామో మాటల్లో చెప్పలేం అంటూ క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: