ఆ విషయంలో ఎన్టీఆర్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారా...?

murali krishna
ఎన్టీఆర్ వారసుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ అంచలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు.
ప్రతి హీరో కి అభిమానులుంటారు.. ట్రోలర్స్ కూడా ఉంటారు. జూనియర్ విషయంలో కూడా అంతే ఉంటుంది.. ఎంతమంది అభిమానులున్నారో ట్రోలర్స్ కూడా అదే సంఖ్యలో ఉన్నారటా.
మొదటినుంచి ఎన్టీఆర్ అంటే గిట్టనివారు సోషల్ మీడియా లో ఎక్కువగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ వేడుక ల సమయం లో కూడా ట్రోలింగ్ చేశారటా.. తాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల విషయంలో ఎన్టీఆర్ పై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. తారకరత్న మృతిచెందిన సమయంలో కూడా ట్రోలింగ్ బాగా జరిగింది. ఈనెల 28 వ తేదీ న ఎన్టీఆర్ శతజయంతి కావడంతో వారంరోజుల ముందునుంచే ఈ వేడుకలను వైభవంగా ప్రారంభించారని తెలుస్తుంది.. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకల కు రాజకీయ రంగంతోపాటు సినీ రంగంలోని ప్రముఖులంతా కూడా హాజరయ్యారు.
వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రాలేద ని బాగా ట్రోలింగ్ జరుగుతోంది. రామ్ చరణ్, సిద్ధు జొన్నలగడ్డ, నాగచైతన్య తదితర కుర్ర హీరోలంతా హాజరైనప్పటికీ ఎన్టీఆర్ రాకపోవడాని కి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారటా.. వారిని చూసి నేర్చుకోవాలంటూ కూడా సలహాలిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. అయితే ఎప్పుడైతే ఎన్టీఆర్ కు ఇన్విటేషన్ ఇచ్చారో ఆరోజు పుట్టినరోజు కాబట్టి రాలేనని ముందే చెప్పాల్సింది కదా అంటున్నారటా.
 ఆరోజు తాను రాలేనని ముందే చెప్పాడని, అయితే ఈ వేడుకకు ప్రమోషన్స్ కోసం శ్రేయాస్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ ఫొటో ను ఉపయోగించుకున్నట్లు కూడా తెలుస్తోంది. దీన్ని అర్థం చేసుకోలేని ట్రోలర్స్ ఇంకా ఎన్టీఆర్ పై పదే పదే విమర్శల వర్షం కురిపిస్తున్నారటా.. కావాలనే ఎన్టీఆర్ పై నెగెటివిటీని వ్యాపింప చేస్తున్నారని ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: