ఆది పురుష్ సినిమా కోసం అలాంటి త్యాగం చేసిన ప్రభాస్..!?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలో దాదాపుగా 2000 కోట్లకు పైగానే ఖర్చు చేసి తీసారట. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ గట్టిగానే చేయబోతున్నారట చిత్రబృందం. ఇదిలా ఉంటే ఇంకా తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన శ్రీరామ్ అన్న పాట సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ అభిమానులతో పాటుగా సినీ ప్రేక్షకులను సైతం ఈ పాట వేరే లోకానికి తీసుకెళ్లినట్టుగా గ్రాఫిక్స్ చాలా చక్కగా క్రియేట్ చేశారు.
ఇదిలా ఉంటే ఇక తాజాగా ప్రభాస్ ఈ సినిమా కోసం ఒక త్యాగం చేశాడు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్ వెజ్ తినలేదు.. అని పూర్తిగా వెజ్ భోజనం చేశారని.. ఇలా చేయడానికి కారణం ఆయనకు ఆ దేవుడి మీద ఉన్న నమ్మకమే..అని అంటున్నారు. ఏదేమైనా ఇంతలా టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ మన ప్రభాస్ మాత్రం దేవుని ఇంతలా నమ్ముతున్నాడు. ఇక ఇలాంటి ఒక స్టార్ హీరో మన సినీ ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం అని అంటున్నారు ప్రభాస్ అభిమానులు..!!