ఆ క్రేజీ బ్యానర్లో "క్రాక్" కాంబినేషన్లో మరో సినిమా..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటగా డాన్ శీను మూవీ రూపొందింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో రవితేజ సరసన శ్రేయ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని కి మొట్ట మొదటి సినిమా. ఈ మూవీ తో ఈ దర్శకుడు మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో బలుపు మూవీ రూపొందింది. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే వీరిద్దరి కాంబినేషన్ లో క్రాక్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... సముద్ర కని ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.

ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మూడు మూవీ లు రూపొంది ... మూడు అద్భుతమైన విజయాలు సాధించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ ... గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరో మూవీ రుపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటి అయినటువంటి మైత్రి మూవీస్ సంస్థ నిర్మించబోతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: