వైరల్ గా మారుతున్న హేమ.. కూతురు ఫొటోస్..!!

Divya
తెలుగు సినిమా ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరుపొందింది హేమ.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎన్నో చిత్రాలలో హీరో హీరోయిన్ లకు అక్క ,వదిన, పిన్ని పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హేమ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో నటించలేకపోతోంది. ముఖ్యంగా బ్రహ్మానందం తో హేమ చేసేటువంటి కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇప్పటివరకు తెలుగులో దాదాపుగా వందకు పైగా సినిమాలలో నటించి మెప్పించింది హేమ.. ఒకప్పుడు కేరీయర్ వరంగా సినిమాలలో నటిస్తూ ఉండేది. మీడియాలో జరిగే విషయాలపై తనదైన  స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధించిన విషయాలను కూడా స్పందిస్తూ ఉంటుంది హేమ. ప్రస్తుతం హేమ వయసు 40 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ కూడా యంగ్ బ్యూటీగానే పేరుపొందింది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనకు తన కూతురికి సంబంధించి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది హేమ.
ఇదంతా ఇలా ఉంటే తాజాగా నటి హేమ ఇటీవలే లండన్ లో ఉన్న కూతురు ఇషా వద్దకు వెళ్లడం జరిగింది. కగా హేమ కూతురు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం ఇమే లండన్ లో ఉన్నత విద్యలు అభ్యసిస్తోంది. తన కూతురు వద్ద హేమ సమ్మర్ వెకేషన్కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది.
ఇంగ్లాండ్ వీధుల్లో తల్లి కూతుర్లు ఇద్దరు తిరుగుతూ రచ్చ చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా హేమ తన కూతురితోపాటు ట్రెండీ లుక్ లో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. డెనిమ్ జీన్స్ ధరించ కూతురుతో పాటు అందాల ఆరబోతతో ఆకట్టుకుంటోంది హేమ. టైట్ జీన్స్ లో హేమ అందాలు చేసిన పలువురు నెటిజన్లు సైతం పలు రకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం ఈ వయసులో ఇలాంటి దుస్తులు అవసరమా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: